స్పోర్ట్స్ డెస్క్: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) అభిమానుల సంఖ్య రోజు రోజుకీ పెరుగుతోంది. తాజాగా సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఇన్‌స్టాగ్రామ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే)ను అధిగమించింది.
ఇప్పటివరకు 17.7 మిలియన్ల ఫాలోవర్స్‌తో సీఎస్‌కే అగ్రస్థానంలో ఉండగా, ఇప్పుడు ఆర్‌సీబీ 17.8 మిలియన్లతో తొలిస్థానంలోకి దూసుకెళ్లింది.
ఈ జాబితాలో మూడో స్థానంలో ముంబయి ఇండియన్స్ (ఎంఐ) ఉంది. ఎంఐకి ప్రస్తుతం 16.2 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారు. ఐపీఎల్ చాంపియన్‌షిప్ విషయానికి వస్తే, సీఎస్‌కే, ఎంఐలు చెరో ఐదు సార్లు టైటిల్ గెలుచుకున్నాయి. కానీ ఆర్‌సీబీ ఇప్పటివరకు ఒక్క ట్రోఫీ కూడా అందుకోలేకపోయింది.
తరచూ ఫైనల్ వరకు వెళ్లినప్పటికీ ట్రోఫీ మిస్ అవుతుండడం ఆర్‌సీబీ ఫ్యాన్స్‌ను నిరాశపరుస్తోంది. అయినప్పటికీ వారి అభిమానంలో మాత్రం తగ్గుదల కనిపించడంలేదు. 2009, 2011, 2016 ఫైనల్స్ వరకు వెళ్లిన ఆర్‌సీబీ, ఈ సీజన్‌లో శుభారంభం చేసింది.
ఇప్పటికే ఆడిన రెండు మ్యాచ్‌ల్లో విజయం సాధించిన ఆర్‌సీబీ ప్రస్తుతం పాయింట్ల పట్టికలో టాప్‌లో కొనసాగుతోంది. మరి ఈసారి ఫైనల్‌లో షాక్ ఇస్తుందా? టైటిల్ గెలుస్తుందా? అన్నది ఆసక్తికరంగా మారింది.