బెంగళూరు: ఐపీఎల్ 15వ సీజన్ అయిన ఐపీఎల్ 2022 మెగా వేలం జరగుతున్న నేపథ్యంలో ఐపీఎల్ ఫ్రాంఛైజీలు అన్నీ తాము రిటైన్ చేసుకునే ఆటగాళ్ల జాబితాను నిన్న అంటే నవంబర్ 30వ తేదీన ప్రకటించాయి. ఈ సందర్భంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తాము విరాట్ కోహ్లి, గ్లెన్ మ్యాక్స్‌వెల్, మహ్మద్ సిరాజ్‌ను జట్టులో అట్టిపెట్టుకోవాలని నిర్ణయించుకున్నాయి.
కాగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు యాజమాన్యం విరాట్ కోహ్లిను అందరి కంటే ఎక్కువ ధర 15 కోట్లు వెచ్చించి తామే రిటైన్ చేసుకుంది. కోహ్లీ తరువాత అత్యంత ధర తో ఆస్ట్రేలియా హార్డ్ హిట్టర్ అయిన గ్లెన్ మ్యాక్స్‌వెల్‌ని 11 కోట్లతో రిటైన్ చేసుకుంది.
తారువాత భారత ఫాస్ట్ బౌలర్ అయిన మహ్మద్ సిరాజ్‌కు 7 కోట్లు వెచ్చించింది ఆర్సీబీ యాజమాన్యం. కాగా ఐపీఎల్-2021 సీజన్ తో విరాట్ కోహ్లీ ఆర్‌సీబీ యొక్క కెప్టెన్సీ బాధ్యతల నుండి తప్పుకున్నట్లు ప్రకటించారు. మరి ఈ సారి ఆర్సీబీని లీడ్ చేసేది ఎవరో వేచి చూడాలి.