fbpx
Saturday, May 17, 2025
HomeBig StoryRCB vs DC: కోహ్లీ - కృనాల్ పవర్‌తో ఆర్సీబీ రివెంజ్ విజయం!

RCB vs DC: కోహ్లీ – కృనాల్ పవర్‌తో ఆర్సీబీ రివెంజ్ విజయం!

rcb-stuns-dc-in-thrilling-chase-ipl2025

స్పోర్ట్స్ డెస్క్: ఐపీఎల్ 2025లో మరో కీలక మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) ప్రతీకారం తీర్చుకుంది. అరుణ్ జెట్లీ స్టేడియంలో దిల్లీ క్యాపిటల్స్‌పై ఆర్సీబీ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. బ్యాటుతో విరాట్ కోహ్లీ (51) – కృనాల్ పాండ్య (73)లు మెరిశారు. బంతితో భువనేశ్వర్ కుమార్ 3 వికెట్లు తీసి విజయంలో కీలకంగా నిలిచాడు.

163 పరుగుల లక్ష్యాన్ని ఆర్సీబీ 18.3 ఓవర్లలో 165/4తో ఛేదించింది. ప్రారంభంలో జకోబ్ బెథెల్ (12), దేవదత్ పడిక్కల్ (0), రజత్ పటీదార్ (6) విఫలమైనా.. కోహ్లీ (47 బంతుల్లో 51; 4 ఫోర్లు), కృనాల్ (47 బంతుల్లో 73; 5 ఫోర్లు, 6 సిక్స్‌లు) హాఫ్ సెంచరీలతో జట్టును గెలిపించారు. చివర్లో టిమ్ డేవిడ్ (5 బంతుల్లో 19) కూడా మెరిశాడు.

దిల్లీ మొదట బ్యాటింగ్ చేసి 162/8 పరుగులు చేసింది. అభిషేక్ పోరెల్ (28) దూకుడుగా ఆడినప్పటికీ నిలదొక్కుకోలేదు. కెప్టెన్ కేఎల్ రాహుల్ (41) తడబడగా, స్టబ్స్ (34) చివర్లో మంచి ఇన్నింగ్స్ ఆడాడు. భువనేశ్వర్ కుమార్ 3/33తో ధాటిగా బౌలింగ్ చేశాడు. హెజిల్ వుడ్ 2/36, యశ్ దయాల్, కృనాల్ పాండ్య చెరో వికెట్ తీసారు.

ఈ విజయంతో ఆర్సీబీ ప్లే ఆఫ్స్‌కు మరింత చేరువైంది. 9 మ్యాచ్‌ల్లో 7 విజయం సాధించిన ఆర్సీబీ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి దూసుకెళ్లింది. కోహ్లీ ఆరో అర్ధ శతకం, కృనాల్ సూపర్ ఫినిష్, భువీ మాయాజాలతో బెంగళూరు అదరగొట్టింది. RCB అభిమానులకు ఇది నిజమైన ట్రీట్‌గా మారింది.

rcb, dc, kohli, krunalpandya, ipl2025,

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular