స్పోర్ట్స్ డెస్క్: వర్షం కారణంగా 14 ఓవర్లకు కుదించిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ ఐదు వికెట్ల తేడాతో ఆర్సీబీపై విజయాన్ని నమోదు చేసింది. బెంగళూరు నిర్దేశించిన 96 పరుగుల లక్ష్యాన్ని పంజాబ్ 12.1 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది.
ఆఖర్లో నెహాల్ వధేరా (33 నాటౌట్: 19 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) విజయంలో కీలకంగా నిలిచాడు. ఆర్సీబీ బౌలర్లలో జోష్ హెజిల్‌వుడ్ 3 వికెట్లు తీసి ఇరగదీశాడు. భువనేశ్వర్ 2 వికెట్లు దక్కించుకున్నాడు.
పంజాబ్ విజయం సులభంగా అనిపించినా, మధ్యలో వరుసగా వికెట్లు కోల్పోయి ఒత్తిడిలో పడింది. కానీ నెహాల్ ఆట విజయానికి మార్గం వేసింది. ఈ గెలుపుతో పంజాబ్ ఐదో విజయాన్ని నమోదు చేసుకోగా, ఆర్సీబీ మూడో పరాజయం చవిచూసింది.
అంతకుముందు బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 14 ఓవర్లలో 9 వికెట్లకు 95 పరుగులు మాత్రమే చేసింది. టిమ్ డేవిడ్ (50 నాటౌట్: 26 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లు) ఒక్కరే రాణించాడు. కోహ్లీ (1), సాల్ట్ (4), లివింగ్‌స్టోన్ (4) నిరాశపరిచారు. రజత్ పటీదార్ 23 పరుగులు చేశాడు.
పంజాబ్ బౌలర్లలో అర్ష్‌దీప్, యాన్సెన్, చాహల్, హర్‌ప్రీత్ చెరో రెండు వికెట్లు తీసారు. బార్ట్‌లెట్ ఒక వికెట్ తీసి మెరిశాడు. మళ్లీ ఓటమితో ఆర్సీబీ పాయింట్ల పట్టికలో కిందకు జారగా, పంజాబ్ పైనకెక్కింది.