fbpx
Sunday, January 19, 2025
HomeMovie Newsరీ రిలీజ్‌ ల దండయాత్ర … ఏకంగా 7 సినిమాలు

రీ రిలీజ్‌ ల దండయాత్ర … ఏకంగా 7 సినిమాలు

RE-RELEASE-TREND-7-MOVIES-IN-AUGUST
RE-RELEASE-TREND-7-MOVIES-IN-AUGUST

మూవీడెస్క్: తెలుగు ఇండస్ట్రీలో గత కొన్నేళ్లుగా రీ రిలీజ్‌ ట్రెండ్ నడుస్తోంది. స్టార్ హీరోల నుంచి వచ్చి బాక్సాఫీస్ సక్సెస్ అందుకున్న మూవీస్ ని మరల 4k ఫార్మాట్ లో బిగ్ స్క్రీన్ పై రీ రిలీజ్ చేస్తూ వస్తున్నారు.

ఆరంభంలో హీరోల పుట్టినరోజు కానుకగా వారి ఓల్డ్ క్లాసిక్ సినిమాలను ప్రేక్షకుల ముందుకి ఫాన్స్ షోలుగా తీసుకొచ్చారు.

వీటికి ఆదరణ బాగుండడంతో హీరో ఇమేజ్ తో సంబంధం లేకుండా హిట్ సినిమాలను రీ రిలీజ్ చేయడం మొదలుపెట్టారు.

అలాగే కొన్ని ఫ్లాప్ చిత్రాలు కూడా మరల ప్రేక్షకుల ముందుకి వచ్చాయి. ఇప్పటివరకు రీ రిలీజ్ అయిన సినిమాలలో పోకిరి, ఖుషి, జల్సా, ఆరెంజ్, ఒక్కడు, సూర్య సన్నాఫ్ కృష్ణన్ మూవీస్ మంచి కలెక్షన్స్ ని అందుకున్నాయి.

తర్వాత చాలా సినిమాలు ప్రేక్షకులు ముందుకి వస్తూనే ఉన్నాయి. వాటిలో కొన్ని డీసెంట్ కలెక్షన్స్ సాధించాయి. తమిళంలో కూడా రీ రిలీజ్ ట్రెండ్ స్టార్ట్ అయింది. 

ఇదిలా ఉంటే టాలీవుడ్ లో వచ్చే రెండు నెలల్లో ఏకంగా ఏడు సినిమాలు రీ రిలీజ్ కాబోతున్నాయి. ఎస్ ఎస్ రాజమౌళి సూపర్ హిట్ మూవీ ‘విక్రమార్కుడు’ జూలై 27న రీ రిలీజ్ అవ్వనుంది.

నాని, సమంత కాంబినేషన్ లో గౌతమ్ మీనన్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఎటో వెళ్లిపోయింది మనసు’ మూవీ ఆగస్టు 2న ప్రేక్షకుల ముందుకి వచ్చింది.

సూపర్ స్టార్ మహేష్ బాబు ‘ఒక్కడు’ చిత్రాన్ని ఆగస్టు 8న మరోసారి రీ రిలీజ్ చేయబోతున్నారు. ఆగస్టు 9న మహేష్ బాబు సూపర్ హిట్ మూవీ ‘మురారి’ రీ రిలీజ్ కానుంది.

మెగాస్టార్ చిరంజీవి బ్లాక్ బస్టర్ మూవీ ‘ఇంద్ర’ను ఆగస్టు 22న ఆయన బర్త్డే సందర్భంగా రీ రిలీజ్ చేయబోతున్నారు.

ఆర్జీవీ మొదటి సినిమా, కింగ్ నాగార్జున కెరియర్ లో కల్ట్ క్లాసిక్ గా నిలిచిపోయిన శివ చిత్రాన్ని ఆగస్టు 29న రీ రిలీజ్ చేస్తున్నారు.

అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బ్లాక్ బస్టర్ మూవీ గబ్బర్ సింగ్ సెప్టెంబర్ 2న మరోసారి థియేటర్స్ లోకి రాబోతోంది. మరి వీటిలో ఏది ఎక్కువ స్థాయిలో హిట్ అవుతుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular