మూవీడెస్క్: ప్రస్తుతం రీ-రిలీజ్ ట్రెండ్ సినిమాల రేంజ్‌ను పూర్తిగా మార్చేసింది. పాత బ్లాక్‌బస్టర్ సినిమాలు మళ్లీ థియేటర్లలో సందడి చేస్తూ వసూళ్ల వర్షం కురిపిస్తున్నాయి.
ముఖ్యంగా పండుగలు, హీరోల బర్త్‌డేలు, స్పెషల్ ఈవెంట్లకు పాత సినిమాలు రీ-రిలీజ్ అవుతున్నాయి.
ఆడియన్స్ నుంచి విపరీతమైన రెస్పాన్స్ రావడంతో ఈ ట్రెండ్ రోజురోజుకీ బలపడుతోంది.
తాజాగా రీ-రిలీజ్ సినిమాల్లో తుంబాడ్ టాప్‌లో నిలిచింది. ఈ హారర్ థ్రిల్లర్ సినిమా రెండోసారి విడుదలై ₹37.5 కోట్లు వసూలు చేసి రికార్డు క్రియేట్ చేసింది.
అదే విధంగా, సనం తేరీ కసమ్ కేవలం 6 రోజుల్లోనే ₹28.3 కోట్ల వసూళ్లతో రెండో స్థానంలో నిలిచింది.
ఇక హాలీవుడ్ సినిమాలు కూడా ఈ రేసులో దూసుకుపోతున్నాయి.
ఇంటర్‌స్టెల్లార్ రీ-రిలీజ్‌లో ₹18.3 కోట్లు, టైటానిక్ 3D ₹18 కోట్లు వసూలు చేసి టాప్ 10లో చోటు దక్కించుకున్నాయి.
ఈ లిస్ట్‌లో దక్షిణాది నుంచి విజయ్ నటించిన ఘిల్లి మాత్రమే ₹26.5 కోట్లతో టాప్ 10లో చోటు దక్కించుకోవడం విశేషం.
టాలీవుడ్ నుంచి త్వరలో మరిన్ని సినిమాలు రీ-రిలీజ్ బరిలోకి దిగుతాయనే ఆశలు ఉన్నాయి.
ఇండియన్ బాక్సాఫీస్ వద్ద అత్యధిక కలెక్షన్స్ సాధించిన రీ-రిలీజ్ సినిమాలు:
- తుంబాడ్ : ₹37.5 కోట్లు
- సనం తేరీ కసమ్ : ₹28.3 కోట్లు (6 రోజులు)
- ఘిల్లి: 26.5 కోట్లు
- యే జవానీ హై దీవానీ : ₹25.4 కోట్లు
- ఇంటర్‌స్టెల్లార్: ₹18.3 కోట్లు (6 రోజులు)
- టైటానిక్ 3D: ₹18 కోట్లు
- షోలే 3D: ₹13 కోట్లు
- లైలా మజ్ను : ₹11.6 కోట్లు
- రాక్‌స్టార్: ₹11.5 కోట్లు
- అవతార్: ₹10 కోట్లు