వెబ్: ఓటీటీ, గత రెండు మూడు నెలలుగా అందరి నోళ్ళల్లో నానుతున్న పదం. కొందరు అనొచ్చు ఏముందిరా మనం ఇంట్లోనే కూర్చొని అన్ని సినిమాలు చూసెయ్యొచ్చు, కానీ వాస్తవం అందుకు భిన్నం. సినిమాలు ఓటీటీల్లో విడుదల అయితే కొద్దీ రోజుల్లో సినిమా మనుగడే మారిపోతుంది. కానీ వాస్తవం చూస్తే ఓటీటీల్లో సినిమాలు చూసేవాళ్ళు ఎవరు అంటే అర్బన్ ఆడియన్స్ అని చెప్పుకోవచ్చు. ఈ రోజుల్లో అందరూ స్మార్ట్ ఫోన్స్ వాడుతున్నా కూడా ఊళ్లలో, టౌన్స్యు లో యూట్యూబ్ వాడకం తెల్సిన వాళ్ళు కూడా చాలా తక్కువే. అలాంటిది ప్రీమియం సబ్ స్క్రిప్షన్ తీస్కొని విడుదల అయిన కొత్త సినిమాలని ఓటీటీ ల్లో చూసే వాళ్ళ సంఖ్యా చాలా తక్కువ. ఇది ఒక వర్గం ఆడియన్స్ కి మాత్రమే పరిమితం అయిందని చెప్పుకోవచ్చు.
ఒక సినిమా విడుదల అయ్యి ఒక వారం తర్వాత ఇంకా థియేటర్స్ లో ఆడుతుంది అంటే దాని మూల కారణం బి,సి సెంటర్స్ ఆడియన్స్. సిటీల్లో మొదటి వరం తర్వాత సినిమా ఆడటం చాలా అరుదు. ఊళ్లలో, టౌన్స్ లో ఉండి వివిధ పనులు చేసుకునే వాళ్ళు సాయంత్రం కానీ రాత్రి కానీ సినిమాలకి వెళ్లే వాళ్ళు ఎక్కువ. వాళ్ళకి ఓటీటీ ల్లో సబ్ స్క్రిప్షన్ తీస్కొని సినిమాలు చూడడం అనేది కొత్త విషయం. ఒక విధంగా చెప్పాలంటే వాళ్ళకి ఇలా ఓటీటీల్లో విడుదల అయ్యే సినిమాలు చూసే అవకాశం లేదు అన్నట్టే చెప్పుకోవాలి. ఏదైనా కరోనా ఉదృతం తగ్గిపోయి మళ్ళీ థియేటర్లు తెరచుకుంటే అందరికి సినిమా వినోదం సమపాళ్లలో అందుబాటులో ఉంటుంది.