ముంబై: ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ యొక్క వాట్సాప్ రోజుకో కొత్త ఫీచర్లతో యూజర్లకు గొప్ప అనుభూతినిస్తోంది. ఈ మధ్యే డిజప్పీయరింగ్ మెసేజెస్ ఫీచర్‌ను ప్రారంభించిన వాట్సాప్ త్వరలో ఇంకొన్ని అధునాతన సౌకర్యాలను అందించనున్నట్లు వేబ్‌టెయిన్‌ఇన్ఫో పేర్కొంది.
ఈ కొత్త ఫీచర్లలో రీడ్ లేటర్, వీడియోలను పంపే ముందు మ్యూట్ చేయడం, రిపోర్ట్ టు వాట్సాప్ తదితర ఫీచర్లను ప్రస్తావించింది. కొద్ది రోజులక్రితం వాట్పాస్ పేమెంట్స్, బల్క్ డీలిట్, షాపింగ్ బటన్ తదితరాలను వాట్సాప్ ఆవిష్కరించింది. ప్రస్తుతం 12 కొత్త ఫీచర్లు అభివృద్ధి దశలో ఉన్నట్లు తెలుస్తోంది.
మెసేజీలను తదుపరి కాలంలో చదివేందుకు వీలుగా రీడ్ లేటర్ ఫీచర్‌ను వాట్సాప్ రూపొందిస్తోంది. ఇది ఇప్పటికే వినియోగంలో ఉన్న ఆర్కీవ్‌డ్ చాట్స్ ఫీచర్ పరిధిలోనికే వస్తుంది. ఈ ఫీచర్‌ను మరింత ఆధునీకరిస్తోంది వాట్సాప్. ఈ ఫీచర్‌ను ఆన్ చేస్తే ఆర్కీవ్ చేసిన చాట్ నుంచి కాల్స్ లేదా మెసేజీలను అందుకునే వీలుండదు.
వెకేషన్ మోడ్‌తో సహా ఆధునీకరించిన ఈ ఫీచర్ ద్వారా ఆర్కీవ్ చేసిన అన్ని మెసేజీలతోపాటు, కొత్తగా వచ్చిన మెసేజీలను కూడా స్టోర్ చేసుకోవచ్చు. అయితే, రీడ్‌లేటర్‌ను ఆన్ చేస్తే మాత్రం ఈ చాట్‌కు సంబంధించి నోటిఫికేషన్స్ వెలువడవు. తద్వారా మధ్యలో అంతరాయాలకు తెరదించవచ్చని టెక్ నిపుణులు చెబుతున్నారు.
ప్రస్తుతం వాట్సాప్‌ను మొబైల్‌లో వాట్సాప్‌తోపాటు, వెబ్ యాప్ ద్వారా రెండు డివైస్‌లలో ఓకేసారి వినియోగించేందుకు వీలుంది. అయితే వినియోగదారుడు ఒకే అకౌంట్ ద్వారా ఒకేసారి నాలుగు డివైస్‌లలో వాట్సాప్‌ను వినియోగించేందుకు వీలు కల్పించే సన్నాహాల్లో కూడా ఉన్నట్లు సమాచారాం.
అంతేకాకుండా అడ్వాన్స్‌డ్ వాల్‌పేపర్ ఫీచర్ పేరుతో యూజర్లు ఒక్కో కాంటాక్టుకు ఒక్కోరకమైన వాల్‌పేపర్‌ను సెట్ చేసుకునేందుకు కూడా వీలుగా వాట్సాప్‌ను తీర్చిదిద్దుతున్నట్లు తెలుస్తోంది.