విజయవాడ: మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ రియల్ ఎస్టేట్ రంగాన్ని అభివృద్ధి చేయడానికి సంస్కరణలను ప్రకటించారు.
విజయవాడలో నరేడ్కో సెంట్రల్ జోన్ డైరీ 2025 ఆవిష్కరణ కార్యక్రమంలో మంత్రి పాల్గొని రియల్ ఎస్టేట్ ప్రాముఖ్యతను వివరించారు.
గత పాలకుల వైఫల్యాలు రియల్ ఎస్టేట్ రంగంపై తీవ్ర ప్రభావం చూపాయని, తాము సంస్కరణలతో ఆ పరిస్థితిని మార్చాలని కృషి చేస్తున్నామని చెప్పారు.
లే అవుట్ అనుమతుల ప్రక్రియను సులభతరం చేసేందుకు రోడ్ల వెడల్పును 12 మీటర్ల నుంచి 9 మీటర్లకు తగ్గిస్తున్నామని, ఫిబ్రవరి నాటికి సింగిల్ విండో విధానాన్ని అందుబాటులోకి తెస్తామని తెలిపారు.
భవన నిర్మాణాలకు 15 రోజుల్లోనే అనుమతులు ఇచ్చేలా మార్పులు చేస్తున్నామని, 500 మీటర్లకుపైగా ఉన్న భవనాలకు సెల్లార్ అనుమతులు కూడా ఇస్తున్నామని వెల్లడించారు.
రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ మెరుగుపడాలంటే రియల్ ఎస్టేట్ రంగం బలపడాలని, వ్యాపారులు ప్రభుత్వానికి సహకరించాలని కోరారు.
కార్యక్రమంలో నరేడ్కో ప్రతినిధులు మంత్రిని సత్కరించారు. సంక్రాంతి తర్వాత అమరావతిలో నిర్మాణ పనులు ప్రారంభమవుతాయని తెలిపారు.