fbpx
Saturday, January 18, 2025
HomeMovie Newsదేవర సినిమాలో నిజమైన ఘటన

దేవర సినిమాలో నిజమైన ఘటన

REAL-INCIDENT-BASED-MOVIE-DEVARA
REAL-INCIDENT-BASED-MOVIE-DEVARA

మూవీడెస్క్: కొరటాల శివ తెరకెక్కించిన దేవర సెప్టెంబర్ 27న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఈ పాన్ ఇండియా మూవీపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.

సినిమా టీజర్, సాంగ్స్ ప్రేక్షకుల నుండి మంచి స్పందన అందుకున్నాయి. హై వోల్టేజ్ యాక్షన్ ప్యాక్డ్ కథాంశంతో కూడిన ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది.

అయితే దేవర సినిమా కథ ఒక నిజ జీవిత ఘటన ఆధారంగా తీసుకున్నదన్న వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

1987లో ఆంధ్రప్రదేశ్‌లోని కారంచేడు లో జరిగిన దళితుల ఊచకోత సంఘటన ఈ సినిమాకి స్ఫూర్తి అని కొందరు అభిప్రాయ పడుతున్నారు.

ఆ సంఘటనలో రెండు కులాల మధ్య జరిగిన ఘర్షణ వల్ల కొంతమంది దళితులు ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఘటన ఆధారంగా కొరటాల శివ ఈ కథను రాసుకున్నారని, కానీ పూర్తిగా ఫిక్షనల్ స్క్రీన్ ప్లేతో సినిమా రూపొందించారని టాక్ వస్తోంది.

ఈ వార్త ఎంతవరకు నిజమో తెలియదుగానీ, గతంలో రవితేజ, గోపీచంద్ మలినేని కూడా ఇలాంటి బ్యాక్‌డ్రాప్ లో ఒక సినిమా చేయాలని భావించి, ఆ తర్వాత దాని పై వెనుకడుగు వేశారు.

ఇప్పుడు దేవర పై వస్తున్న ఈ వార్తలు సినిమా ఆడియన్స్ లో మరింత ఆసక్తిని పెంచాయి. ఎన్టీఆర్ ఈ సినిమాలో ఒక వర్గానికి రక్షకుడిగా కనిపించనున్నాడని, అలాగే సైఫ్ అలీ ఖాన్ బందిపోటు పాత్రలో నటించనున్నాడని తెలుస్తోంది.

ఇక జాన్వీ కపూర్ ఈ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అవుతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular