హైదరాబాద్: కరోనా మహమ్మారి దెబ్బ తరువాత క్రమంగా మన దేశ రియల్ ఎస్టేట్ రంగం క్రమంగా పుంజుకుంటోంది. దక్షిణాదిలో నగరాలైన హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలు రియల్ ఎస్టేట్ వ్యాపారం రికవరీలో వెన్నెముకగా నిలబడుతున్నాయని మ్యాజిక్‌బ్రిక్స్ ఓనర్స్ సర్వీసెస్ సర్వేలో తెలిపింది.
ఈ నగరాల్లోని గృహ యజమానులు సీరియస్ విక్రయదారులుగా ఉన్నారని ఆ కంపెనీ సర్వేలో వెల్లడైంది. కర్ణాటక బెంగళూరు గృహ అమ్మకాల్లో మొదటి స్థానంలో నిలవగా, హైదరాబాద్ నగరం రెండవ స్థానంలో ఉంది. ఈ రెండు నగరాల తరువాత చెన్నై, పుణే, ముంబై నగరాలు ఉన్నాయి.
సౌలభమైన రవాణా, మరియు మెట్రో కనెక్టివిటీ బాగా ఉండటమే దక్షిణాది రాష్ట్రాల్లో ప్రాపర్టీల విక్రయాల పెరుగుదలకు ప్రధాన కారణాలని తెలిపింది. సరసమైన గృహాలతో పాటు కనెక్టివిటీ ఉన్న ప్రాంతాల్లోని ప్రాపర్టీల మీదే కొనుగోలుదారులు ఆసక్తి చూపిస్తున్నారు.