టాలీవుడ్: టాలెంట్ ఉన్నా కూడా అగ్ర తారగా అవకాశాలు పొందలేని నటి రెజీనా కాసాండ్రా. మీడియం రేంజ్ హీరోలతో మంచి హిట్లు సాధించినా కూడా ఎందుకో రెజీనా టాప్ హీరోయిన్ గా మెరవలేకపోయింది. తెలుగు లో అడవి శేష్ తో నటించిన ‘ఎవరు’ సినిమా తర్వాత మరో సినిమాలో కనిపించలేదు. ప్రస్తుతం ‘నేనే నా’ అనే ఒక బై లింగువల్ సినిమాలో నటిస్తుంది. తెలుగులో ‘నేనే నా’ తమిళ్ లో ‘సారపంగై’ అనే టైటిల్ తో ఈ సినిమా రానుంది. ఈ సినిమాలో రెజీనా రెండు పాత్రల్లో నటించనున్నట్టు అర్ధం అవుతుంది. ఈ సినిమా పోస్టర్స్ చూస్తుంటే ఆ విషయం అర్ధం అవుతుంది.
మామూలుగా ఉండే అమ్మాయి పాత్రలో ఒక లుక్ ఉండగా చంద్ర ముఖి తరహా లో ఉండే ఒక పాత కాలపు పాత్రలో మరొక లుక్ ఉంది. పాత్ర తాలూకు మేకప్, కాస్ట్యూమ్స్ , లుక్స్ చూసిన తర్వాత ఇది ఒక పాత రాజుల కాలం నాటి కథతో ముడిపడినట్టు అనిపిస్తుంది. ఈ సినిమాలో మరిన్ని పాత్రల్లో వెన్నెల కిషోర్, అక్షర గౌడ నటిస్తున్నారు. సామ్ సి.ఎస్ సంగీతంలో ఈ సినిమా రూపొందనుంది. సందీప్ కిషన్ హీరో గా రూపొందిన ‘నిను వీడని నీడను నేనే’ సినిమాని డైరెక్ట్ చేసిన కార్తీక్ రాజు ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమా గురించి మరిన్ని వివరాలు మరి కొద్ది రోజుల్లో తెలియచేయనున్నారు.