మూవీడెస్క్: తమిళ సూపర్ స్టార్ విజయ్ ప్రస్తుతం రాజకీయాల్లో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో, ఆయన 69వ చిత్రం గురించి ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఈ సినిమా విజయ్ కెరీర్‌లో ప్రత్యేకమైన స్థానం సంపాదించేలా ఉండబోతోందని సమాచారం.
కాగా, ఈ చిత్రం “భగవంత్ కేసరి” తమిళ రీమేక్‌గా రూపొందనున్నట్లు కోలీవుడ్ వర్గాలు వెల్లడించాయి.
ఈ చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్‌ను తమిళ ప్రేక్షకుల అభిరుచికి అనుగుణంగా మారుస్తున్నట్లు చెబుతున్నారు.
పూజా హెగ్డే కథానాయికగా నటిస్తుండగా, శ్రీలీల పాత్రను మమిత బైజు పోషిస్తారని టాక్.
ఈ చిత్రం 2026 సంక్రాంతికి విడుదల చేయాలని చిత్ర బృందం యోచిస్తోంది.
పండగ సీజన్‌లో విడుదల కావడం సినిమాకు ప్లస్‌గా మారవచ్చని భావిస్తున్నారు.
ఇదే సమయంలో, ఈ చిత్రానికి విజయ్ మొదటి సినిమా “నాలయ తీర్పు” పేరును టైటిల్‌గా పరిశీలిస్తున్నట్లు సమాచారం.
ఈ టైటిల్ అభిమానుల్లో ప్రత్యేక ఎమోషన్ తీసుకురాగలదని, అలాగే విజయ్ కెరీర్‌ను ప్రతిబింబిస్తుందని చిత్ర యూనిట్ నమ్ముతోంది.
రాజకీయంగా విజయ్ వేగంగా ముందుకెళ్తుండటంతో, ఈ సినిమా ఆయన ఫ్యాన్ బేస్‌ను మరింత బలోపేతం చేయనుంది.
ఇంతటి అంచనాల మధ్య ఈ చిత్రం ప్రేక్షకుల హృదయాలను ఎలా గెలుచుకుంటుందో చూడాలి.
THALAPATHY VIJAY LAST MOVIE RELEASE IS FOR SANKRANTHI 2026