fbpx
Saturday, January 18, 2025
HomeMovie Newsవాలెంటైన్ వీక్ లో మెగా హీరో డెబ్యూ మూవీ

వాలెంటైన్ వీక్ లో మెగా హీరో డెబ్యూ మూవీ

ReleaseDate LockedFor VishnavTejUppenaMovie

టాలీవుడ్: మెగా మేనల్లుడు వైష్ణవ తేజ్ ఉప్పెన అనే సినిమాలో నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసి విడుదల చేసే సమయం లో కరోనా కారణంగా సినిమా వాయిదా పడుతూ వచ్చింది. కానీ ఈ మధ్య కాలంలో ఎక్కడ కూడా సినిమా గురించి జనాలు మరచిపోకుండా పాటల్ని విడుదల చేస్తూ సినిమాని ప్రమోట్ చేసుకున్నారు. ఎట్టకేలకు ఫిబ్రవరి 12 న ఈ సినిమాని విడుదల చేయబోతున్నట్టు మూవీ మేకర్స్ ప్రకటించారు. ఫిబ్రవరి వాలెంటైన్ వీక్ లో ఈ ప్రేమ కథని థియేటర్లలో చూడండని ప్రమోట్ చేస్తున్నారు. ఈ సినిమా నుండి ఇప్పటి వరకు విడుదలైన పాటలు అన్నీ ఆకట్టుకున్నాయి. ఈ సినిమా ద్వారా దేవి శ్రీ ప్రసాద్ కం బ్యాక్ అవుదామని చూస్తున్నాడు.

మైత్రి మూవీ మేకర్స్ మరియు సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ పై ఈ సినిమా రూపొందింది. సుకుమార్ ఈ సినిమాకి రచన సహకారం అందించాడు. ఈ సినిమా ద్వారా కృతి శెట్టి హీరోయిన్ గా పరిచయం అవుతుంది. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సాన ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. ఇప్పటివరకైతే మెగా హీరో డెబ్యూ మూవీ విడుదల తేదీ కి కాంపిటీషన్ లేదు, మున్ముందు ఇంకేమైనా సినిమాలు ఇదే విడుదల తేదీ లాక్ చేస్తాయో లేదో తెలియాల్సి ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular