fbpx
Tuesday, December 31, 2024
HomeInternationalసబ్‌మెరైన్‌ కేబుల్‌ ప్రాజెక్టులకు జియో శ్రీకారం

సబ్‌మెరైన్‌ కేబుల్‌ ప్రాజెక్టులకు జియో శ్రీకారం

RELIANCE-JIO-UNDERWATER-CABLING-FOR-HIGHSPEED-INTERNET

న్యూఢిల్లీ: సెల్ల్యూలార్/మొబైల్ రంగాలలో ఎప్పుడూ సంచలనాలతో ముందు ఉండే రిలయన్స్‌ జియో ఇన్ఫోకామ్ ఇప్పుడు‌ మరో ఘనతను సాధించడానికి సంసిద్ధమవుతోంది. రోజు రోజుకూ పెరుగుతున్న డేటా వినియోగ అవసరాలను దృష్ట్యా ప్రపంచంలోనే తొలి సారి భారీ స్థాయిలో సబ్‌మెరైన్‌ కేబుల్‌ సిస్టమ్‌ ప్రాజెక్టులకు కంపెనీ శ్రీకారం చుట్టింది.

ఈ కేబుల్స్ సిస్టం సముద్ర మార్గం ద్వారా ఆధునిక కేబుల్స్‌తో ఇండియా ఆసియా ఎక్స్‌ప్రెస్, ఇండియా యూరప్‌ ఎక్స్‌ప్రెస్‌ పేర్లతో ప్రాజెక్టులను అమలు చేయబోతోంది. ముంబై, చెన్నై కేంద్రంగా 16,000 కిలోమీటర్లు సముద్రంలో ఈ కేబుల్స్‌ వేస్తారు. ఒక సెకనుకు 200 టెరాబైట్స్‌ వేగంతో ఇంటర్నెట్‌ సామర్థ్యం ఉండబొతోంది. భారత్‌తో తూర్పున సింగపూర్, థాయ్‌లాండ్, మలేషియా, పశ్చిమంలో ఈజిప్ట్, జిబూటీ, సౌదీ అరేబియాతోపాటు ఇటలీని కనెక్ట్‌ చేస్తారు.

ఈ ప్రాజెక్ట్లు 2024 ప్రారంభాం ణాటికి పూర్తి అవుతాయని సమాచారం. ఈ రెండు ప్రాజెక్టులు ఒకదానితో ఒకటి అనుసంధానమై, అంతర్జాతీయ డేటా ‌ఇంటర్ ఎక్స్ ఛేంజ్ పాయింట్లను కలుపుతాయి. భారతదేశం ‌తో పాటు, బయట కూడా వినియోగదార్లు, కంపెనీలకు కంటెంట్, క్లౌడ్‌ సేవల విషయంలో సామర్థ్యం పెంచేందుకు ఈ ప్రాజెక్టులు దోహదం చేస్తాయని రిలయన్స్‌ జియో వెల్లడించింది.

ఫైబర్‌ ఆప్టిక్‌ సబ్‌మెరైన్‌ టెలికమ్యూనికేషన్ల చరిత్రలో మొదటిసారిగా ఈ వ్యవస్థలు భారతదేశాన్ని అంతర్జాతీయ నెట్‌వర్క్‌ పటంలో ఉంచుతాయి. భారత్‌లో డిజిటల్‌ సేవలు, డేటా వినియోగం వృద్ధిలో జియో ముందుంది. భారత్‌ కేంద్రంగా తొలిసారి సబ్‌మెరైన్‌ కేబుల్‌ సిస్టమ్‌ ప్రాజెక్టుల నిర్మాణంలో నాయకత్వ పాత్రను పోషిస్తున్నాం అని రిలయన్స్‌ జియో ప్రెసిడెంట్‌ మాథ్యూ ఊమెన్‌ వ్యాఖ్యానించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular