ఈ మధ్య తెలుగులో రీమేక్ చేసే సినిమాల సంఖ్య చాలా పెరుగుతుంది. మెగా స్టార్ చిరంజీవి నుంచి డెబ్యూ అయ్యే కొత్త హీరో వరకు అందరూ రీమేక్ లనే నమ్ముకుంటున్నారు. అంటే మన దగ్గర కథలు లేవనా? లేక వస్తున్న కథలను జడ్జిమెంట్ చెయ్యలేకపోవడమా?. ప్రస్తుతానికి దాదాపు 6 -10 మళయాళ సినిమా రైట్స్ తెలుగు ప్రొడ్యూసర్స్ చేతిలో ఉన్నాయి. ఇవి కేవలం పెద్ద ప్రొడక్షన్స్ చేతిలో ఉన్న సినిమా రైట్స్. ఇంకా ఎన్నెన్ని రైట్స్ ఎవరెవరు తీసుకున్నారో తెలియదు. ఈ పరిస్థిని బట్టి చూస్తేనే తెలుస్తుంది మన దగ్గర కథల కొరత ఎలా ఉందొ లేదా కథలని జడ్జి చేసే వాళ్ళ పరిస్థితి ఎలా ఉందో.
ఇప్పటికే కొణిదెల ప్రొడక్షన్స్ చేతిలో ‘డ్రైవింగ్ లైసెన్స్’, ‘లూసిఫర్’ రైట్స్, సితార ఎంటర్టైన్మెంట్స్ వారి చేతిలో ‘అయ్యప్పణ్ణుమ్ కోశియుమ్’, ‘కప్పెలా‘ రైట్స్, పీవీపీ వారి చేతిలో ‘హెలెన్’ రైట్స్, స్రవంతి రవి కిషోర్ చేతిలో ‘ఇష్క్’ సినిమా రైట్స్ ఉన్నాయి. ఇవి కాక వెంకటేష్ నటిస్తున్న ‘నారప్ప’ తమిళ సినిమా అసురన్ కి రీమేక్. రిలీజ్ కి రెడీ గా ఉన్న రామ్ ‘రెడ్’ కూడా ఒక తమిళ్ సినిమా రీమేక్. ఇలా చూస్తూ పోతే ఇప్పుడు రాబోతున్న సగం సినిమాలు రీమేక్. డిజిటల్ ప్లాట్ ఫార్మ్ అందుబాటులోకి వచ్చిన తర్వాత అందరూ వేరే బాషా సినిమాలు కూడా చాలా చూస్తున్నారు. ఆల్రెడీ తెల్సిన కథ ని చూసిన సినిమాని ఎంత నేటివిటీ జోడించినా కూడా ఒక కొత్త సినిమా చూస్తున్నాం అనే ఫీల్ ఐతే ఆల్రెడీ చూసిన ప్రేక్షకులకి (దాదాపు 30 శాతం మంది) ఉండదు. ఇది మెల్లి మెల్లిగా సినిమా ప్రేక్షకులని థియేటర్స్ కి దూరం చేస్తుంది. ఇలా రీమేక్లు పెరుగుతూ పోతూ ఉంటె థియేటర్లలో సినిమా మనుగడే ప్రశ్నార్ధకం అవుతుంది.
ఇదంతా చదివిన తర్వాత పెద్ద హీరోలతో కొత్తరకం సినిమాలు అంటే రిస్క్ ఉంటది, భయం ఉంటది అనే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ పైన చెప్పిన సగం సినిమాలు ఆయా భాషల్లో అతి తక్కువ బడ్జెట్ తో నిర్మించిన సినిమాలు. మన దగ్గర కూడా మంచి కథలతో వచ్చే కొత్త దర్శకులు చాలా మందే ఉన్నారు. ఇలాంటి రీమేక్ ల బదులు కొత్త కథలని తక్కువ బడ్జెట్ లతో నిర్మించడం ఉత్తమం. అపుడు మనం కూడా వేరే బాషల వాళ్ళకి కథలు అందించినట్టు అవుతుంది. మన సినిమాలు కూడా ఓటీటీల్లో హిట్స్ అవుతాయి.