రాజమండ్రి: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, రేణూ దేశాయ్ ల తనయుడు అకీరా నందన్ (AKIRA NANDAN) సినిమాల్లో అడుగుపెడతాడా అనే ఆసక్తి పవర్ స్టార్ అభిమానుల్లో ఎప్పటినుంచో నెలకొంది.
ఇటీవల, ఒక యాడ్ ఫిలిం షూటింగ్ కోసం రాజమండ్రి వచ్చిన రేణూ దేశాయ్ (RENU DESAI) తన కుమారుడు సినీ రంగ ప్రవేశంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
అందరూ తనను అకీరా సినిమాల్లోకి ఎప్పుడు వస్తాడని అడుగుతున్నారని, తనకు కూడా తల్లిగా ఈ విషయంపై ఆసక్తి ఉందని రేణూ దేశాయ్ చెప్పారు.
అయితే, ఈ విషయంలో నిర్ణయం పూర్తిగా అకీరా చేతిలోనే ఉంటుందని ఆమె స్పష్టం చేశారు. అతడే తగిన సమయంలో తన నిర్ణయం తీసుకుంటాడని పేర్కొన్నారు.
అకీరా పుణేలో విద్యాభ్యాసం పూర్తి చేసి, ప్రస్తుతం అమెరికాలో ఒక ఫిల్మ్ ఇన్ స్టిట్యూట్‌లో శిక్షణ పొందుతున్నాడు.
పియానో వాయించడంలో కూడా అకీరా మంచి నైపుణ్యం సంపాదించాడని సమాచారం.
ఇక అకీరా తన తల్లిదండ్రుల్లా నటన ఎంచుకుంటాడా, లేక సంగీతాన్ని కెరీర్‌గా ఎంచుకుంటాడా అన్నది తెలిసేందుకు కొంత సమయం వేచి చూడాల్సి ఉంటుంది.