టాలీవుడ్: వెన్నెల సినిమాతో ఒక అవుట్ అండ్ అవుట్ కామెడీ సినిమా రూపొందించి ఇండస్ట్రీ కి డైరెక్టర్ గా పరిచయం అయ్యాడు డైరెక్టర్ దేవా కట్ట. తర్వాత ‘ప్రస్తానం’ అనే సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు దేవా కట్టా. సినిమా రిలీజ్ అయిన టైం లో అంత గుర్తింపు రాకపోయినా తర్వాత్తర్వాత కల్ట్ సినిమాగా గుర్తింపు లభించింది. తర్వాత ‘ఆటో నగర్ సూర్య‘ సినిమా రూపొందించి బడ్జెట్ పరమైన కారణాల వలన అనుకున్నట్టుగా రూపొందించకపోవడం తో సినిమా ప్లాప్ గా నిలిచింది. ఇన్ని రోజుల గ్యాప్ తర్వాత సాయి ధరమ్ తేజ్ తో కలిసి ‘రిపబ్లిక్’ అనే సినిమా ని రూపొందిస్తున్నాడు దేవా కట్టా.
‘ప్రతి రోజు పండగే’, ‘సోలో బ్రతుకే సో బెటర్’ లాంటి హిట్స్ సాధించిన సాయి ధరమ్ తేజ్ ‘రిపబ్లిక్’ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో అన్యాయం సహించని ఒక కలెక్టర్ పాత్రలో నటిస్తున్నాడు. పొలిటికల్ డ్రామాస్ తో మంచి కంటెంట్ ఫుల్ సినిమాలు రూపొందించగల దేవా కట్టా మరోసారి పొలిటికల్ సబ్జెక్టు తోనే రానున్నాడు. ఈ సినిమాకి మణి శర్మ సంగీతం అందిస్తున్నాడు. ఈ రోజు మణి శర్మ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా నుండి మొదటి పాట విడుదల విడుదల చేసారు. స్వేచ్ఛ ని ఓ అమ్మాయిలా ఊహించుకొని కాలేజ్ లో స్టూడెంట్స్ పాడే పాటగా ఈ పాట రూపొందింది. షూటింగ్ మొత్తం పూర్తి చేసుకున్న ఈ సినిమా థియేటర్లు తెరచుకోగానే మంచి టైం చూసుకుని విడుదల చేయాలని చూస్తున్నారు.