ఢిల్లీ: భారత్-న్యూజిలాండ్ టెస్ట్ సిరీస్‌లో భారత జట్టు ఓటమికి సంబంధించి సోషల్ మీడియాలో వచ్చిన విమర్శలపై భారత ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ ఘాటుగా స్పందించారు. ఆటగాళ్లను వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం సరైన పద్ధతి కాదని గంభీర్ అభిప్రాయపడ్డాడు.
టెస్ట్ జట్టులో అద్భుతమైన ఆటగాళ్లు ఉన్నారని, కోచింగ్ సిబ్బందిగా వారి సన్నాహక శక్తిని గౌరవించడం తమ బాధ్యతగా భావిస్తున్నామని చెప్పాడు.
‘‘మా జట్టుకు వ్యక్తిగత రికార్డ్స్ అవసరం లేదు. జట్టుగా విజయం సాధించడం మాత్రమే మా ప్రాధాన్యం’’ అని గంభీర్ పేర్కొన్నాడు. యువ ఆటగాళ్లు తమను తాము నిరూపించుకోవడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటారని, తాము ప్రతి మ్యాచ్‌లో ఉత్తమ ప్రతిభను చూపిస్తామని చెప్పారు.
వాషింగ్టన్ సుందర్‌ను కివీస్ సిరీస్‌లో ఆడించడం గురించి వచ్చిన విమర్శలపై స్పందిస్తూ, అతను తనదైన శైలిలో ప్రదర్శన చేసి జట్టు విజయాలకు దోహదపడతాడని ఆశాభావం వ్యక్తం చేశారు.
భారత్ తదుపరి ఆస్ట్రేలియా పర్యటన కోసం సన్నాహాల్లో ఉందని, కఠినమైన పిచ్‌లపై తమ జట్టు పోరాడేందుకు సన్నద్ధంగా ఉందని గంభీర్ స్పష్టం చేశాడు.
ఆటగాళ్ల ఎంపికలో ఒపెనింగ్‌కు అభిమన్యు ఈశ్వరన్, కేఎల్ రాహుల్ వంటి బలమైన ఆప్షన్లు ఉన్నాయని, ఫైనల్ జట్టు ఎంపికపై నిర్ణయం త్వరలోనే తీసుకుంటామని తెలిపారు. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌పై కాకుండా, ప్రతి మ్యాచ్‌ను సీరియస్‌గా తీసుకుని జట్టు గెలుపు కోసం ప్రయత్నిస్తామని గంభీర్ పేర్కొన్నాడు.