జాతీయం: జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో 110 మంది ఫలితాలు నిలిపివేత – ఎన్టీఏ కీలక నిర్ణయం
అక్రమాలకు పాల్పడ్డవారిపై ఎన్టీఏ చర్య
జేఈఈ (మెయిన్) సెషన్-2 ఫలితాల్లో భాగంగా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (National Testing Agency – NTA) కీలక ప్రకటన చేసింది. అక్రమాలకు పాల్పడి నకిలీ పత్రాలు ఉపయోగించినట్లు గుర్తించిన 110 మంది అభ్యర్థుల ఫలితాలను నిలిపివేసినట్లు వెల్లడించింది. వారి వ్యవహారంపై విచారణ కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు.
అడ్వాన్స్‌డ్‌కు అర్హత కోసం కటాఫ్ స్కోర్లు
జేఈఈ అడ్వాన్స్‌డ్ (JEE Advanced) పరీక్షకు అర్హత సాధించాలంటే అభ్యర్థులు నష్టపరిచే కనీస పర్సంటైల్ స్కోర్లు సాధించాల్సి ఉంటుంది. కటాఫ్‌లు ఈ విధంగా ఉన్నాయి:
- జనరల్ – 93.102
- ఈడబ్ల్యూఎస్ – 80.383
- ఓబీసీ – 79.431
- ఎస్సీ – 61.15
- ఎస్టీ – 47.90
ఈ స్కోర్‌కు సమానం లేదా ఎక్కువ పర్సంటైల్ పొందినవారే మే 18న జరగనున్న అడ్వాన్స్‌డ్ పరీక్షకు అర్హులు కానున్నారు. రెండుసెషన్లలో కలిపి మొత్తం 24 మంది 100 పర్సంటైల్‌ను సాధించారు.
అడ్వాన్స్‌డ్ దరఖాస్తులకు కీలక తేదీలు
జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షకు ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ ఏప్రిల్ 23 నుండి మే 2 వరకూ కొనసాగుతుంది. అభ్యర్థులు ఈ మధ్యకాలంలో అధికారిక వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేయాల్సి ఉంటుంది.
తుది కీ ఆలస్యంపై అసహనం
జేఈఈ సెషన్-2 పేపర్-1 తుది సమాధానాలు (Final Answer Key) గురువారం విడుదలైన కొన్ని గంటల్లోనే తొలగించబడ్డాయి. దీనిపై అధికారిక సమాచారం లేకపోవడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు అయోమయంలోకి వెళ్లారు. ఎన్టీఏ శుక్రవారం ‘ఎక్స్’ వేదికగా స్పందిస్తూ శనివారం ఫలితాలను విడుదల చేస్తామని ప్రకటించింది.
అలాగే మధ్యాహ్నం 2 గంటలలోపు తుది కీ విడుదల చేస్తామని తెలిపినా.. సమయానికి విడుదల చేయకపోవడంతో విద్యార్థులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో పలువురు వినూత్నంగా తమ ఆగ్రహాన్ని పోస్ట్‌లు ద్వారా వ్యక్తీకరించారు.