ప్రదీప్ రంగనాథన్, అనుపమ పరమేశ్వరన్, కయాదు లోహర్ ప్రధాన పాత్రల్లో నటించిన రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ విడుదలైన రోజున పెద్దగా అంచనాలు లేకున్నా, ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే వసూళ్లు రాబడుతోంది. అశ్వత్ మారిముత్తు దర్శకత్వం వహించిన ఈ చిత్రం, కామెడీ డ్రామాగా ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. లియోన్ జేమ్స్ సంగీతం సినిమాకు మరో ప్లస్‌గా మారింది.
ఫిబ్రవరి 21న తెలుగు, తమిళ భాషల్లో విడుదలైన ఈ సినిమా మొదట సాధారణ ఓపెనింగ్స్‌నే నమోదు చేసింది. కానీ కంటెంట్ బలంగా ఉండటంతో, వర్డ్ ఆఫ్ మౌత్ ద్వారా వేగంగా హిట్‌గా మారిపోయింది. 35 కోట్ల బడ్జెట్‌తో నిర్మించిన ఈ సినిమా ఇప్పటివరకు 120 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టినట్టు సమాచారం. దీంతో నెట్‌ఫ్లిక్స్ స్ట్రీమింగ్‌ను ఫిబ్రవరి 28కి వాయిదా వేశారు.
కథ విషయానికి వస్తే.. హీరో కాలేజ్‌లో ఇంటర్ చదువుతూ లవ్‌లో పడతాడు. అయితే ప్రేమ వల్ల చదువు దెబ్బతిని, ఆ తర్వాత జీవితంలో స్థిరపడటానికి చాలా కష్టపడతాడు. ఈ లోపు గతంలో తనను వదిలేసిన వాళ్లు తిరిగి వస్తారు. ఆ తర్వాత ఏం జరిగిందనేది కథా సరాంశం.
ఈ సినిమా కామెడీ, ఎమోషనల్ ఎలిమెంట్స్ సమపాళ్లలో ఉండటంతో, అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద స్టడీగా కొనసాగుతున్న ఈ చిత్రం, మరో వారం రోజుల పాటు మంచి వసూళ్లు సాధించే అవకాశం ఉంది.