తెలంగాణ: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోని ప్రభుత్వం హైదరాబాద్ మహానగర పరిధిని విస్తరించేందుకు భారీ ప్రణాళికలు రూపొందించింది.
ప్రస్తుతం హెచ్ఎండీఏ పరిధి 7,257 చదరపు కిలోమీటర్లకు విస్తరించి ఉండగా, ఈ విస్తరణతో 13,000 చదరపు కిలోమీటర్లకు చేరుకోనుంది.
ఇందులో కొత్తగా మరో నాలుగు జిల్లాలు, 32 మండలాలు చేరనుండగా, మొత్తం 11 జిల్లాలు, 106 మండలాలు ఈ పరిధిలోకి రానున్నాయి.
ఈ కొత్త ప్రణాళికలతో నగర రియల్ ఎస్టేట్ రంగం మరింత వేగంగా అభివృద్ధి చెందనుంది. ట్రిపుల్ ఆర్ (రీజనల్ రింగ్ రోడ్) పరిధి దాటి ఐదు కిలోమీటర్ల వరకు ఈ విస్తరణ ఉండనుంది.
ఈ పరిధిలో కొత్తగా 5,000 చదరపు కిలోమీటర్ల భూమి హైదరాబాద్ మహానగర పరిధిలో చేరనుంది. ప్రభుత్వం ఈ ప్రతిపాదనల్ని మంత్రివర్గ సమావేశంలో ఆమోదం పొందే దిశగా చర్యలు చేపడుతోంది.
ఇప్పటికే హెచ్ఎండీఏ పరిధిలో ఉన్న ప్రాంతాల్లో భూముల డిమాండ్ పెరుగుతుండగా, ఈ విస్తరణ నిర్ణయం రియల్ ఎస్టేట్ రంగానికి మరింత ఊతం ఇవ్వనుంది.
50 ఏళ్ల క్రితం 650 చదరపు కిలోమీటర్ల పరిధిలో స్థాపించిన హైదరాబాద్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (హుడా)ని 2006లో హెచ్ఎండీఏగా మార్చి, 7,257 చదరపు కిలోమీటర్లకు విస్తరించారు. ఇప్పుడు ఈ కొత్త నిర్ణయంతో హైదరాబాద్ అభివృద్ధి మరింత వేగంగా సాగనుంది.