తెలంగాణ: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా హనుమకొండలో నిర్వహించిన విజయోత్సవ సభలో సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై కామెంట్ చేస్తూ, ఆయన అసెంబ్లీలో రుణమాఫీపై చర్చకు సిద్ధమా? అని సవాల్ విసిరారు. రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, కేసీఆర్ ప్రజల నుంచి దూరంగా ఫామ్ హౌస్‌లో ఉండటం ఎంచుకున్నారని విమర్శించారు.
“కేసీఆర్ తాగుబోతుల సంఘానికి అధ్యక్షుడు, ఫుల్ కో-హాఫ్ కో బ్రాండ్ అంబాసిడర్” అంటూ రేవంత్ సెటైర్లు వేశారు. ప్రజలను మద్యం మత్తులో ఉంచి పాలన సాగించాలన్నది కేసీఆర్ వ్యూహమని ఆరోపించారు.
“ప్రజల కోసం కేసీఆర్ బయటకు రాకుండా, కేటీఆర్, హరీష్ లాంటి ఇద్దరు వ్యక్తులను ముందుకు పంపుతున్నారు” అంటూ పరోక్షంగా వారిని టార్గెట్ చేశారు.
రెవంత్ రెడ్డి మాట్లాడుతూ, పదేళ్ల కేసీఆర్ పాలనలో రుణమాఫీ సాధ్యం కాలేదని, కానీ తన ప్రభుత్వం పదేల్లో 18 వేల కోట్ల రుణమాఫీ పూర్తి చేసిందని తెలిపారు.
“తెలంగాణ ప్రజలు కేసీఆర్ మోసాన్ని గుర్తించి ఆయనకు తగిన సమాధానం ఇచ్చారు” అంటూ పేర్కొన్నారు. ఇక తెలంగాణలో కేసీఆర్ ఆధిపత్యానికి మళ్లీ చోటు ఇవ్వబోమని ధీమా వ్యక్తం చేశారు.