టాలీవుడ్: కరోనా వల్ల, లాక్ డౌన్ వల్ల అందరూ ఇంటి పట్టున ఉన్నారు కానీ రామ్ గోపాల్ వర్మ మాత్రం వరుసపెట్టి సినిమాల మీద సినిమాలు తీసి ATT లో విడుదల చేసాడు. మొన్న ‘కరోనా వైరస్’ మూవీ ప్రెస్ మీట్ లో కూడా ‘అందరూ లాక్ డౌన్ సమయంలో వంటల వీడియోలు చేస్తూ ఉంటె నేను సినిమాలు తీసాను’ అని చెప్పుకొచ్చాడు. డిసెంబర్ 11 న ఆయన తీసిన కరోనా వైరస్ సినిమా విడుదల అవబోతుంది. దీంతో పాటు ‘మర్డర్’ అనే మరో సినిమా కూడా విడుదలకి సిద్ధం అయింది. ఇదివరకే విడుదల అవ్వాల్సిన ఈ సినిమా కోర్ట్ స్టే వల్ల ఆగిపోయింది.
మిర్యాలగూడ పరువు హత్యని మూల కథగా తీసుకుని ఈ సినిమా తీసాడు వర్మ. ఈ పరువు హత్యని హత్య చేయించిన అమ్మాయి తండ్రి కోణం లో వర్మ ఈ సినిమా తీసాడు. ఈ సినిమాని అడ్డుకుంటాం అంటూ ‘అమృత’ (పరువు హత్య కాబడ్డ వ్యక్తి భార్య) కోర్టుకు వెళ్ళింది. ఇన్నిరోజులు స్టే ఆర్డర్ ఉండడం వలన సినిమా విడుదలకి నోచుకోలేదు. అన్ని అడ్డంకులు తొలిగి ఈ సినిమాని సెన్సార్ కూడా చేయించాడు వర్మ. ఆ సినిమా సెన్సార్ రిపోర్ట్ వచ్చిందని ట్విట్టర్ ద్వారా షేర్ చేసి మరి కొద్దీ రోజుల్లో విడుదల చేయబోతున్నట్టు తెలపకనే తెలిపాడు.