హైదరాబాద్: తెలుగు సినిమాని తెలుగు సినిమా టెక్నిషియన్స్ ని 20 ఏళ్ళ క్రితమే ఒక మెట్టు ఎక్కించాడు రామ్ గోపాల్ వర్మ అనడం లో అతిశయోక్తి లేదు. ఎందుకంటే శివ అనే ఒక్క సినిమా తోనే తెలుగు సినిమాలో కొత్త పోకడలను క్రియేట్ చేయగలిగాడు ఆ క్రియేటివిటీ తోనే బాలీవుడ్ లో కూడా చాలా కాలం అద్భుతమైన సినిమాలు తీసి మంచి పేరు గడించాడు. కాల క్రమేణా తాను తీసే సినిమాల సంఖ్య తగ్గకపోయినా సినిమాల్లో క్వాలిటీ తగ్గి , ఉన్న మంచి పేరు కాస్త పోగొట్టుకుంటున్నాడు. ఒక విధంగా చెప్పాలంటే కరోనా ని రామ్ గోపాల్ వర్మ వాడుకున్నట్టు ఎవరూ వాడుకోవట్లేదు అనే చెప్పుకోవాలి. చాలా మంది తారలు, డైరెక్టర్స్, నిర్మాతలు తీసిన సినిమాలు ఎలా విడుదల చేసుకోవాలి, షూటింగ్స్ మధ్యలో ఉన్న సినిమాలో ఎలా పూర్తి చెయ్యాలి అని ఆలోచిస్తుంటే RGV మాత్రం ఈ లాక్ డౌన్ లో సినిమాల మీద సినిమాలు తీసి జనాల మీదకి వొదిలేస్తున్నాడు. అందులో క్వాలిటీ ఉండట్లేదు అనుకోండి అది వేరే విషయం.
ప్రస్తుతం రామ్ గోపాల్ వర్మ ‘ఆర్ జి వి వరల్డ్ థియేటర్’ అనే ఓటీటీ లాంటి మీడియం ని లాంచ్ చేయడం తో పాటు ఇంతవరకు ఎవరు చేయని పనికి శ్రీకారం చుట్టాడు. ఈ మీడియం ద్వారా ట్రైలర్ వ్యూ కి కూడా డబ్బులు వసూలు చేసే కొత్త బిజినెస్ కి శ్రీకారం చుట్టాడు. తన ‘ఆర్ జి వి వరల్డ్ థియేటర్’ ద్వారా సినిమా ట్రైలర్ విడుదల చేస్తున్నట్టు అలాగే సినిమా ట్రైలర్ వీక్షించడానికి ఒక్క వ్యూ కి 25 రూపాయలు గా కూడా రేట్ ఫిక్స్ చేసాడు. అలాగే తేన ఆర్ జి వి వరల్డ్ థియేటర్ ద్వారా ట్రైలర్ బుకింగ్, మూవీ బుకింగ్, బ్లాక్ బుకింగ్ (విడుదల సమయం లో డిమాండ్ ని కాష్ చేసుకోవడానికి ఉంటుందని), కరెంటు బుకింగ్ (విడుదలైన కొన్న రోజుల తర్వాత కాస్ట్ తక్కువగా ఉంటుందని) ఇలా 4 రకాల ఆప్షన్స్ ఉంటాయని చెప్పారు.
అలాగే ప్రస్తుతం రామ్ గోపాల్ వర్మ ఈ కొత్త ఆలోచనకి తాను తీస్తున్న ‘పవర్ స్టార్‘ అనే సినిమాతో శ్రీకారం చుడుతున్నట్టు చెప్పారు. ట్రైలర్ కోసం అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చేశామని , మూవీ 25 జులై ని విడుదల అవ్వబోతుందని 22 జులై నుండి సినిమా బుకింగ్స్ కూడా ‘ఆర్ జి వి వరల్డ్ థియేటర్’ లో ఓపెన్ అవుతాయని చెప్పాడు. ఇపుడు సినిమాలే టోరెంట్స్ లో డౌన్లోడ్ చేసుకొని చూస్తున్న రోజుల్లో ట్రైలర్ ని ఎవరు డబ్బులు పెట్టి చూస్తారో అర్ధం కయానీ పరిస్థితుల్లో సాధారణ ప్రజలు ఉన్నారు. కానీ రామ్ గోపాల్ వర్మ ఏం చేసిన సంచలనం కాబట్టి, ఎలాగు కొద్దీ రోజుల తర్వాత ట్రేడ్ ఫిగర్స్ అనౌన్స్ చేస్తాడు కాబట్టి దీని ఫ్యూచర్ ఏంటి అనేది అప్పటికి తెలుస్తుంది.