యూపీ: టీమిండియా యువ క్రికెటర్ రింకూ సింగ్ తన వ్యక్తిగత జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించబోతున్నాడా? అనేలా సందేహం కలుగుతోంది.
ఇటీవల ఉత్తరప్రదేశ్‌కు చెందిన సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ ప్రియా సరోజ్‌తో రింకూ ఎంగేజ్‌మెంట్ చేసుకున్నట్లు సోషల్ మీడియాలో ఒక పోస్ట్ వైరల్ అవుతోంది.
అయితే, రింకూ గానీ, ప్రియా సరోజ్ గానీ ఈ విషయంపై అధికారికంగా స్పందించలేదు. ప్రియా సరోజ్ ప్రస్తుతం మచ్లిషహర్ లోక్‌సభ స్థానం నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు.
25 ఏళ్లకే ఈ ఘనత సాధించిన ఆమె, ఢిల్లీ యూనివర్సిటీలో చదివి సుప్రీంకోర్టు న్యాయవాదిగా పని చేశారు. రాజకీయాల్లో తక్కువ సమయంలోనే మంచి గుర్తింపు పొందిన ఆమెపై ఉన్న క్రేజ్ కూడా ఈ వార్తలను మరింత ఆసక్తికరంగా మారుస్తోంది.
మరోవైపు, రింకూ సింగ్ టీమిండియా తరఫున టీ20 మ్యాచ్‌లలో కీలక పాత్ర పోషిస్తున్న యువ క్రికెటర్. ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) జట్టు తరఫున ఆడే రింకూ, తన ప్రతిభతో పేరు సంపాదించాడు.
ఇటీవల జరిగిన ఐపీఎల్ 2025 మెగా వేలానికి ముందు కేకేఆర్ అతడిని రూ.13 కోట్లకు రిటైన్ చేయడం విశేషం.
సోషల్ మీడియాలో వస్తున్న ప్రచారంపై రింకూ, ప్రియా నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ వార్తలు నిజమా? కాదా? అన్నది చూడాల్సి ఉంది.