fbpx
Sunday, March 16, 2025
HomeSportsరిషభ్ పంత్ ప్రాణదాత రజత్.. ఇప్పుడు ప్రాణాలతో పోరాటం

రిషభ్ పంత్ ప్రాణదాత రజత్.. ఇప్పుడు ప్రాణాలతో పోరాటం

rishabh-pant-savior-rajat-suicide-attempt

యూపీ: రిషభ్ పంత్ ప్రాణాలు కాపాడిన రజత్ కుమార్ జీవితంలో విషాదం చోటుచేసుకుంది. ఫిబ్రవరి 9న ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్ జిల్లా బుచ్చా బస్తీలో రజత్ తన ప్రియురాలు మను కశ్యప్‌తో కలిసి విషం తాగి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. ప్రేమకు కుటుంబ అనుమతి లేకపోవడం ఈ దారుణానికి కారణమని తెలుస్తోంది.

ఈ ఘటనలో మను కశ్యప్ ఆసుపత్రిలో మృతిచెందగా, రజత్ పరిస్థితి విషమంగా ఉంది. ప్రస్తుతం అతను ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. స్థానికులు ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రజత్ కుటుంబం ఆయన ప్రాణాలు నిలవాలని ప్రార్థిస్తోంది.

రజత్ 2022లో రిషభ్ పంత్ కారు ప్రమాదంలో అతని ప్రాణాలు కాపాడిన వ్యక్తి. ఆ సమయంలో రజత్, నిషు కుమార్ కలిసి పంత్‌ను కారులో నుంచి బయటకు తీసి రక్షించారు.

ఈ కృతజ్ఞతగా రిషభ్ పంత్ వారిద్దరికి బైక్స్ బహుమతిగా ఇచ్చాడు. ఇప్పుడు రజత్ ఆత్మహత్యకు యత్నించడం అందరినీ షాక్‌కు గురిచేసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular