టాలీవుడ్: షార్ట్ ఫిలిమ్స్ చేస్తూ నటిగా ఎదిగిన తెలుగు హీరోయిన్ రీతూ వర్మ. బాద్ షా, ప్రేమ ఇష్క్ కాదల్, ఎవడే సుబ్రహ్మణ్యం లాంటి సినిమాల్లో సపోర్టింగ్ పాత్రలు చేసి మెప్పించిన రీతూ వర్మ తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో రూపొందిన నేషనల్ అవార్డు విన్నింగ్ మూవీ ‘పెళ్లి చూపులు’ సినిమాతో మెయిన్ స్ట్రీమ్ హీరోయిన్ గా అడుగులు వేసింది. ఈ సినిమాలో రీతూ నటనకి అవార్డ్స్ కూడా లభించాయి. ఆ తర్వాత మెల్లగా అడపా దడపా సినిమాలు చేసినప్పటికీ అంత గుర్తింపు రాలేదు. తెలుగు తో పాటు తమిళ్ లో కూడా సినిమాలు చేయడం మొదలు పెట్టిన రీతూ వర్మ 2020 ఆరంభం లో దుల్కర్ సల్మాన్ తో నటించిన ‘కనులు కనులని దోచాయంటా’ సినిమాతో సూపర్ సక్సెస్ సాధించింది.
ఈ సినిమా తర్వాత తెలుగు, తమిళ్ భాషల్లో బిజీ హీరోయిన్ గా దూసుకెళ్తుంది రీతూ వర్మ. ప్రస్తుతం రీతూ నటించిన టక్ జగదీశ్, వరుడు కావలెను దాదాపు షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకి సిద్ధంగా ఉన్నాయి. లాక్ డౌన్ సమయంలో నువ్విలా నువ్విలా సినిమాతో అశోక్ సెల్వన్ సరసన నటించి మెప్పించిన రీతూ వర్మ మరోసారి అశోక్ సెల్వన్ తో ఇంకో సినిమాలో నటించనుంది. ఈ సినిమా షూటింగ్ మరి కొద్దీ రోజుల్లో మొదలవనుంది. ఇది కూడా పలు భాషల్లో విడుదలవనుంది. విక్రమ్ నటించిన ‘ధృవ నచ్చిత్రం’ సినిమాలో గౌతమ్ మీనన్ దర్శకత్వంలో కూడా రీతూ వర్మ నటించింది. శర్వా హీరోగా రూపొందుతున్న ‘ఒకే ఒక జీవితం‘ సినిమాలో కూడా రీతూ హీరోయిన్ గా నటిస్తుంది. ఇలా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న దాదాపు ఐదు క్రేజీ సినిమాల్లో రీతూ వర్మ నటిస్తూ టాప్ గేర్ లో దూసుకెళ్తుంది.