తెలుగులో టాలెంటెడ్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్న రీతూ వర్మ, ఇటీవల ఓ ఇంటర్వ్యూలో గ్లామర్ పాత్రలపై తన అభిప్రాయం వెల్లడించారు. తనపై ట్రెడిషనల్ ముద్ర పడిపోయిందని, అందుకే గ్లామర్ రోల్స్ ఆఫర్ కావడం లేదని ఆమె చెప్పింది.
“ముద్దు సీన్లు ఉన్న సినిమాలు చేయనని అనుకుంటున్నారు. కానీ, కథ డిమాండ్ చేస్తే అలాంటి సీన్లు చేయడంలో ఎలాంటి ఇబ్బంది లేదు. హీరోయిన్లపై ముందే ఒక ఇమేజ్ క్రియేట్ అవుతుంది. దాని వల్లనే కొన్ని ఆఫర్స్ మిస్సవుతున్నాయి” అని రీతూ చెప్పింది.
గత ఏడాది ఆమె నటించిన స్వాగ్ సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఆడకపోయినా, ఆ ప్రాజెక్ట్ తనకు ప్రత్యేకమని పేర్కొన్నారు.
తన కెరీర్‌లో మలుపు తిప్పిన పెళ్లిచూపులు గురించి మాట్లాడుతూ, “తరుణ్ భాస్కర్ సీక్వెల్ తీయాలని అనుకుంటే, తప్పకుండా నటిస్తా. ఆ సినిమా విజయ్ దేవరకొండ, నాకు స్పెషల్” అని తెలిపారు.