టాలీవుడ్: తెలుగు సినిమాల్లో యాక్షన్ మూవీస్, కామెడీ మూవీస్, ఫామిలీ మూవీస్.. ఇలా రకరకాల కాటగిరీస్ సినిమాలు ఉన్నట్టే పీపుల్ క్యాటగిరి సినిమాలు కూడా కొన్ని ఉన్నాయ్. అన్ని రకాల సినిమాలు మారినా కూడా జనాల కోసం సినిమాలు తీసే వ్యక్తి మాత్రం మారలేదు, ఆయన సినిమాలు తీసే విధానం మారలేదు. అయన ఎవరో కాదు ఆర్. నారాయణమూర్తి. జనాల కోసం సినిమాలు తీస్తూ తన సినిమాల ద్వారా జనాల వాజ్యం వినిపించడానికి ప్రయత్నిస్తుంటాడు. గత 20 -30 సంవత్సరాలుగా ఎన్నో మార్పులు చూసాం కానీ వ్యక్తి గా కానీ, తాను సినిమా ద్వారా వ్యక్తపరిచే విషయం కానీ ఆర్. నారాయణమూర్తి దగ్గర మారలేదు. అందుకే ఆయనకీ ఎంతో మంది అభిమానులు. పూరి జగన్నాథ్ లాంటి వారే ఆయన్ని ఆదర్శంగా తీసుకుని టెంపర్ సినిమాలో నిజాయితీ గా ఉండే పోసాని పాత్రకి మూర్తి పేరు ఈ సినిమా పీపుల్స్ స్టార్ గా పిలవబడే ఆర్. నారాయణమూర్తి గారికి అంకితం చేసారు.
నారాయణమూర్తి గారు ప్రస్తుత పరిస్థితుల్లో రైతుల బాధలని ఉద్దేశిస్తూ ‘రైతన్న’ అనే సినిమా రూపొందించారు. ఈ సినిమాకి సంబందించిన ప్రెస్ మీట్ లో గద్దర్ మాట్లాడుతూ నారాయణ మూర్తి గారి గొప్పతనాన్ని చెప్తూ ఇప్పటికీ సింపుల్ గా బ్రతుకుతాడు అన్నట్టు మాట్లాడితే దాన్ని మీడియా వక్రీకరించి నారాయణమూర్తి గారి దగ్గర డబ్బులు లేవని, ఆరోగ్యం సరిగ్గా లేదని, సిటీ లో బ్రతకలేక ఎక్కడో మారుమూల బ్రతుకుతున్నాడని రకరకాల వార్తలు రాశారు. దీనిపై నారాయణమూర్తి గారు ప్రెస్ మీట్ పెట్టి తన రెస్పాన్స్ తెలిపారు.
తాను చాలా ఆరోగ్యంగా ఉన్నానని, తనకి ఎలాంటి సమస్యలు లేవని, డబ్బుల పరంగా కూడా ఎలాంటి ఇబ్బంది లేదని తెలిపారు. తాను సిటీ లో బ్రతకలేనని, పల్లె బ్రతుకు ఇష్టమని అందుకే దూరంగా వూర్లో ఉంటానని అంతే కానీ డబ్బులు లేక కాదు అని తెలిపాడు. నేను ఎన్నో రికార్డ్ సినిమాలు తీసినా కూడా నేల పైన పడుకుంటా, ఇపుడు కూడా నేల పైన పడుకుంటా నా జీవన విధానమే అంత, నేను చాలా హ్యాపీ గా ఉన్నాను నాకు ఎలాంటి సమస్యలు లేవు.. దయ చేసి ఇలాంటి వార్తలు రాయకండి అని ప్రెస్ మీట్ లో గట్టిగానే తెలిపాడు.