fbpx
Thursday, April 3, 2025
HomeMovie Newsతెలుగు సినిమా కాలర్ ఎగరవేసేలా RRR గర్జన

తెలుగు సినిమా కాలర్ ఎగరవేసేలా RRR గర్జన

RoarOFRRR Making Video

టాలీవుడ్: బాహుబలి లాంటి పాన్ ఇండియా సినిమా రూపొందించి రీజనల్ సినిమాతో ఇండియా లెవెల్ లో రికార్డులు తిరగరాసి బాలీవుడ్ వాళ్ళు కూడా ఈర్ష్య పడేలా సినిమా రూపొందించిన డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం జూనియర్ ఎన్ఠీఆర్ మరియు రామ్ చరణ్ తో ‘RRR – రణం రౌద్రం రుధిరం’ అనే సినిమాని రూపొందిస్తున్నాడు. ఒకటి రెండు పాటలు మినహా షూటింగ్ మొత్తం పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉన్నారు. కరోనా వేవ్ 3 లేకపోతే అనుకున్నట్టుగానే అక్టోబర్ 13 న ఈ సినిమాని విడుదల చేయడానికి ఎలాంటి అడ్డంకులు లేకుండా చూసుకున్నాడు రాజమౌళి.

ఇంకో మూడు నెలల్లో సినిమా విడుదల అయ్యే అవకాశాలు ఉండడం తో సినిమా ప్రమోషన్స్ మొదలు పెట్టింది RRR సినిమా టీం. ఇందులో భాగంగా ‘రోర్ అఫ్ RRR ‘ అని ఒక వీడియో విడుదల చేసారు. రెండు నిమిషాల నిడివి ఉన్న ఈ వీడియో లో ప్రతీ ఫ్రేమ్ గూస్ బంప్స్ తెప్పించేలా ఉంది. సినిమాలో పని చేసిన ప్రతి క్రాఫ్ట్ మన్ కష్టాన్ని ఈ వీడియో లో చూపించారు. డైరెక్టర్ రాజమౌళి, సినిమాటో గ్రాఫర్ సెంథిల్, ఆర్ట్ డైరెక్టర్ సాబు సిరిల్ , సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి, కాస్ట్యూమ్ డిసైనర్ రామా రాజమౌళి, నిర్మాత డి.వీ.వీ. దానయ్య తో పాటు సినిమా షూటింగ్ కి సంబందించిన కొన్ని వీడియోలు చూపించారు. చూపించిన ప్రతీ ఫ్రేమ్ లో సినిమా తియ్యడానికి పడిన కష్టం కనిపిస్తుంది.

పాన్ ఇండియా స్కేల్ లో రూపొందిన ఈ సినిమా ఎక్కడా కంప్రమైస్ కాకుండా రూపొందినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా ఫైట్స్ విషయంలో ఈ సినిమా టీం కష్టం ఈ వీడియో లో చూస్తుంటే గూస్ బంప్స్ రాక మానవు. వీడియో లో సినిమాలో నటిస్తున్న సముద్రఖని, శ్రియ శరన్, ఒలివియా మోరిస్, అజయ్ దేవగన్, ఆలియా భట్ తో పాటు చివరగా రామ్ చరణ్ మరియు తారక్ కి సంబందించిన ఇంటెన్స్ లుక్ తో వీడియో ముగించి చివర్లో అక్టోబర్ 13 న రాబోతున్నట్టు తెలిపారు. ఓవరాల్ గా ఈ టీజర్ చూసిన తర్వాత మరోసారి తెలుగు సినిమా అభిమానులు కాలర్ ఎగరేసేలా బాహుబలి రేంజ్ సినిమా రూపొందించినట్టు తెలుస్తుంది. వీడియో టైటిల్ కి తగ్గట్టే మేకింగ్ వీడియో తో ఈ సినిమా టీం గర్జన కనిపిస్తుంది.

Roar Of RRR - RRR Making | NTR, Ram Charan, Ajay Devgn, Alia Bhatt | SS Rajamouli

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular