యూత్ స్టార్ నితిన్, శ్రీలీల జంటగా వెంకీ కుడుముల డైరెక్షన్‌లో తెరకెక్కిన మాస్ ఎంటర్టైనర్ “రాబిన్ హుడ్” ఉగాది సందర్భంగా థియేటర్లలో విడుదలైంది. భీష్మ తర్వాత నితిన్ వెంకీ కుడుముల కాంబోలో వచ్చిన ఈ చిత్రంపై మొదటినుంచే అంచనాలు నెలకొన్నాయి.
విడుదలైన తొలి రోజే ప్రేక్షకుల నుండి మంచి స్పందన రాగా, కామెడీ, యాక్షన్, ఎంటర్‌టైన్‌మెంట్ మిక్స్‌తో పాజిటివ్ టాక్‌ని సొంతం చేసుకుంది.
విశేషంగా, యూఎస్ మార్కెట్‌లో ఈ సినిమా తొలి రోజే $100K గ్రాస్ వసూళ్లను నమోదు చేసింది. ఓవర్సీస్‌లో ఇది నితిన్‌కు ఇప్పటి వరకు వచ్చిన బెస్ట్ స్టార్ట్‌లలో ఒకటిగా మారింది. మొదటి రోజు నుంచే స్టడీ ట్రెండ్ కనిపించడంతో వీకెండ్‌లో బాక్సాఫీస్ వద్ద రాబిన్ హుడ్ దూసుకెళ్లే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.
ఈ చిత్రంలో ఆదిపురుష్ ఫేమ్ దేవదత్త నాగే విలన్‌గా కనిపించగా, రాజేంద్ర ప్రసాద్, వెన్నెల కిషోర్, డావిడ్ వార్నర్ లాంటి నటులు తమ పాత్రలతో ఆకట్టుకున్నారు. ముఖ్యంగా డేవిడ్ వార్నర్ గెస్ట్ రోల్ హైలైట్‌గా నిలిచింది.
జీవి ప్రకాష్ అందించిన సంగీతం యూత్‌కి హిట్ ట్యున్స్‌ను అందించగా, మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణ విలువలతో సినిమా గ్రాండ్‌గా కనిపించింది. ఓవర్సీస్ టాక్ చూస్తే ఈ చిత్రం నితిన్ కెరీర్‌లో మరో హిట్‌గా నిలవనుందన్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.