స్పోర్ట్స్ డెస్క్: ఇంగ్లండ్‌తో జరగనున్న టెస్టు సిరీస్‌కు భారత జట్టుకు మళ్లీ రోహిత్ శర్మ కెప్టెన్‌గా కొనసాగనున్నట్టు సమాచారం. ఇటీవల ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ సిరీస్‌లలో రోహిత్ సారథ్యం ఫలితాల పరంగా ఆశాజనకంగా లేకపోయినా, అతడికే బీసీసీఐ మళ్లీ పగ్గాలు అప్పగించనున్నట్టు తెలుస్తోంది.
ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్‌లో రోహిత్ పేలవంగా రాణించాడు. మూడు టెస్టుల్లో కలిపి కేవలం 31 పరుగులు మాత్రమే చేసి, చివరి మ్యాచ్‌కు దూరమయ్యాడు. అయినా అతడినే కెప్టెన్‌గా కొనసాగించాలన్న నిర్ణయం వెనుక, గతంలో ఆయన నాయకత్వంలో భారత్ గెలిచిన చాంపియన్స్ ట్రోఫీ విజయాన్ని గుర్తు చేసుకుంటున్నారు.
ప్రస్తుతం ఐపీఎల్ జరుగుతున్న నేపథ్యంలో అందుబాటులో ఉండే ఆటగాళ్ల జాబితాను పరిశీలించిన తర్వాతే జట్టును ఖరారు చేయాలన్నది సెలక్టర్ల ఆలోచన. అందుకే మే చివరి వారంలోనే భారత జట్టును అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. ఐపీఎల్ ముగిసిన వెంటనే ఇంగ్లండ్ పర్యటనకు భారత్ సిద్ధమవుతుంది.
ఈ సిరీస్‌లో ఐదు టెస్టులతో పాటు భారత ‘ఏ’ జట్టు లయన్స్‌తో రెండు నాలుగు రోజుల మ్యాచ్‌లు కూడా ఆడనుంది. జూన్ 20న హెడింగ్లీలో మొదటి టెస్టు ప్రారంభం కానుంది. ఈ పర్యటన భారత జట్టు కొత్త పరీక్షగా మారనుంది.