టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ నిరాశజనక ప్రదర్శనతో మరోసారి చర్చకు దారితీశాడు. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా బ్రిస్బేన్ వేదికగా జరిగిన మూడో టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో రోహిత్ కేవలం 10 పరుగులకే ఔటయ్యాడు.
ప్యాట్ కమ్మిన్స్ బౌలింగ్‌లో అలెక్స్ క్యారీకి క్యాచ్ ఇచ్చిన రోహిత్, తాను టచ్‌లోకి వస్తున్నట్లు కనిపించినప్పటికీ వికెట్ కోల్పోయాడు.
అయితే, ఔటైన తర్వాత రోహిత్ చేసిన చర్య అతడి రిటైర్‌మెంట్‌పై ఊహాగానాలకు కారణమైంది. తన గ్లౌవ్స్‌ను డగౌట్ వద్ద వదిలిపెట్టి వెళ్లడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
అభిమానులు దీనిని రిటైర్‌మెంట్ సంకేతంగా చూస్తూ ప్రశ్నలు వేస్తున్నారు. ఈక్రమంలో రోహిత్ శర్మకు జట్టులో ఇంకా స్థానం ఉందా? అనే వాదనలు బలపడుతున్నాయి.
ఇప్పటి వరకు టెస్ట్ సిరీస్‌లో మూడు ఇన్నింగ్స్‌లు ఆడిన రోహిత్ 6.33 సగటుతో కేవలం 19 పరుగులు మాత్రమే చేశాడు. ఇటీవల న్యూజిలాండ్‌తో సిరీస్‌లోనూ అతడి ప్రదర్శన నిరాశపరిచింది.
వరుస వైఫల్యాల కారణంగా కెప్టెన్‌గా అతడి భవిష్యత్తుపై కూడా సందేహాలు వ్యక్తమవుతున్నాయి. రోహిత్ మరింత ఒత్తిడిలో ఉన్నట్లు స్పష్టమవుతోంది.