ఆస్ట్రేలియాతో జరుగుతున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ తర్వాత రోహిత్ శర్మ టెస్టుల్లో కొనసాగడం అనుమానంగా మారింది.
ఇటీవల టెస్టుల్లో అతని బ్యాటింగ్ ఫామ్ లేకపోవడం, వయస్సు కారణంగా అతని పై విమర్శలు పెరిగాయి.
ఇదే సమయంలో, న్యూజిలాండ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్ ఓటమి తర్వాత రోహిత్ నాయకత్వ సామర్థ్యం పట్ల కూడా సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
ఒకవేళ రోహిత్ టెస్టులకు గుడ్ బై చెప్తే, జట్టు పగ్గాలు విరాట్ కోహ్లీకి దక్కే అవకాశం ఉందని టాక్.
భారత టెస్ట్ చరిత్రలో అత్యంత విజయవంతమైన కెప్టెన్‌లలో ఒకడైన కోహ్లీ, 68 మ్యాచ్‌లలో సారథ్య బాధ్యతలు నిర్వర్తించి, 40 విజయాలు అందించాడు.
జట్టు సభ్యులను ఉత్సాహపరిచే కోహ్లీ నైపుణ్యం, ఫీల్డ్‌లో అతని యాక్టివ్ రోల్ అతనికి కెప్టెన్సీ అవకాశాలు కలిగిస్తున్నాయి.
ప్రస్తుతం టెస్ట్ జట్టులో సీనియర్ ఆటగాళ్లలో కోహ్లీకి మించిన అనుభవం మరెవరికీ లేదు. జస్ప్రీత్ బుమ్రాను మినహాయిస్తే, జట్టు నాయకత్వానికి అనర్హత ఉన్నటువంటి ఆటగాడు లేడని నివేదిక చెబుతోంది.