ఆస్ట్రేలియాతో జరుగుతున్న 5 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ముగిసిన తర్వాత భారత కెప్టెన్ రోహిత్ శర్మ టెస్ట్ ఫార్మాట్‌కు వీడ్కోలు పలకనున్నట్టు సమాచారం.
రిటైర్మెంట్‌పై రోహిత్ ఇప్పటికే బీసీసీఐ అధికారులతో చర్చించి తన నిర్ణయం పక్కా చేసినట్టు తెలుస్తోంది. కానీ, ఈ ప్రకటన సిడ్నీ వేదికగా జరగనున్న చివరి టెస్ట్ మ్యాచ్ తర్వాతే ఉండే అవకాశం ఉంది.
రోహిత్ శర్మ ప్రస్తుత ఫామ్ తీవ్రంగా విమర్శలపాలవుతోంది. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ-2024లో ఇప్పటివరకు ముగిసిన మూడు టెస్టుల్లో రోహిత్ కేవలం 31 పరుగులు మాత్రమే చేశారు.
జట్టు పేసర్ జస్ప్రీత్ బుమ్రా సిరీస్‌లో ఇప్పటికే 30 వికెట్లు సాధించి రోహిత్ పరుగుల స్కోరుకు సమీపంలో ఉన్నారంటూ సోషల్ మీడియాలో ట్రోలింగ్ ఎక్కువైంది.
ఒకవేళ భారత జట్టు ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు చేరితే, ఆ మ్యాచ్ వరకు కొనసాగుతానని రోహిత్ సెలెక్టర్లను కోరినట్టు వార్తలు వెలువడ్డాయి.
రోహిత్ కెప్టెన్సీలో భారత్ టెస్టుల్లో విజయాలను సాధించినప్పటికీ, ఈ సిరీస్‌లో అతని ప్రదర్శన టీమిండియా అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేస్తోంది.