న్యూఢిల్లీ: బీసీసీఐ ఉన్నపలంగా టీమిండియా వన్డే కెప్టెన్సీని రోహిత్ శర్మకు అప్పగిస్తున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయం వల్ల భారత కెప్టెన్‌గా వన్డేల్లో విరాట్ కోహ్లి శకం ఇక ముగిసిన చరిత్ర అయింది. ఈ నేపథ్యంలో భారత మాజీ ఆటగాడు అయిన సాబా కరీం కోహ్లీ కెప్టెన్సీ విషయమై కొన్ని ఆసక్తికర వాఖ్యలు చేశాడు. కోహ్లి భారత టీ20 క్రికెట్‌లో కెప్టెన్సీ నుంచి తప్పకున్నప్పటికీ, వన్డేల్లో కొనసాగాలని భావించినట్లు కరీం తెలిపాడు.
అయితే తన కెప్టెన్సీలో ఒక్క ఐసీసీ ట్రోఫీని కూడా గెలవలేకపోవడమే కోహ్లీని వన్డేల్లో కెప్టెన్‌గా తొలగించడానికి ముఖ్య కారణం అని కరీం అభిప్రాయం వ్యక్తం చేశాడు. “నిజంగా చెప్పాలంటే విరాట్ కోహ్లి కెప్టెన్సీ నుండి ఉద్వాసనకు గురయ్యాడు. టీ20 కెప్టెన్సీ భాధ్యతలనుంచి తప్పుకున్నప్పడు, వన్డే కెప్టెన్సీ గురించి కోహ్లి ఎటువంటి ప్రకటన చేయలేదు.
అంటే కోహ్లీ వన్డే కెప్టెన్‌గా కొనసాగాలని భావించాడు. భారత ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ లేదా బీసీసీఐకి చెందిన ఏదైనా అధికారి కోహ్లితో కెప్టెన్సీ గురించి మాట్లాడి ఉండవచ్చని సాబా కరీం అభిప్రాయపడ్డాడు. ద్రవిడ్, కోహ్లితో మాట్లాడి ఈ నిర్ణయం తీసుకుని ఉంటారని కరీం తెలిపాడు.
అయితే అంతకు ముందు భారత టీ20 ప్రపంచకప్ తర్వాత కోహ్లీ కెప్టెన్సీ బాధ్యతల నుంచి వైదొలగాలని నిర్ణయించుకోవడంతో రోహిత్ శర్మ ని టీమిండియా కు పూర్తిస్థాయి టీ20 కెప్టెన్‌గా నియమించారు.