దుబాయ్: ఇప్పటికే ప్లే-ఆఫ్స్ కు చేరిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కు ఐపీఎల్ 2021 నుండి మొదటగా నిష్క్రమించిన సన్రైజర్స్ హైదరాబాద్ పెద్ద షాక్ ఇచ్చింది. బెంగళూరు పై కేవలం 4 పరుగుల తేడాతో గెలిచింది.
టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న విరాట్ కోహ్లీకి తన బౌలర్లు మంచి ఆరంభాన్నే ఇచ్చారు. హైదరాబాద్ ను కేవలం 141 పరుగులకే కట్టడి చేశారు. హర్షల్ పటేల్ 3 వికెత్లు, డాన్ క్రిష్టియన్ 2 వికెట్లు, జార్జ్ మరియు చాహల్ చెరో వికెట్ తీసి హైదరాబాద్ ను 141 పరుగులకే అవుట్ చేశరు.
142 తక్కువ పరుగుల చేజ్ మొదలెట్టిన బెంగళూరుకు ఆదిలోనే దెబ్బ పడింది. విరాత్ కేవలం 5 పరుగులకే అవుటయ్యాడు. కేవ్లం 40 పరుగులలోపే 3 వికెట్లు కోల్పోయింది. పడిక్కల్ మరియు మాక్స్ వెల్ కాస్త పోరాడి జట్టును గెలిపించే లాగే కనిపించారు. కానీ ఇద్దరూ త్వరగా అవుటయ్యారు.
తరువాత డివిలియర్స్ కాస్త మెరుపులు మెరిపించినప్పటికీ బెంగళూరును గెలిపించలేక పోయాడు. చివరి ఓవర్లో 12 పరుగులు అవసరమైన వేళ ఒక సిక్స్ కొట్టి ఆశలు రేపాడు. కానీ భువీ కట్టుదిట్టమైన బౌలింగ్ వల్ల హైదరాబాద్ 4 పరుగుల తేడాతో బెంగళూరుపై గెలిచింది.