fbpx
Friday, May 9, 2025
HomeBig StoryRR vs LSG: రెండు పరుగుల తేడాతో రాజస్థాన్‌ను ఓడించిన లక్నో

RR vs LSG: రెండు పరుగుల తేడాతో రాజస్థాన్‌ను ఓడించిన లక్నో

rr-vs-lsg-lucknow-edge-out-rajasthan-by-2-runs

ఐపీఎల్ 2025 సీజన్‌లో ఉత్కంఠభరిత పోరులో లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ 2 పరుగుల తేడాతో రాజస్థాన్ రాయల్స్‌పై విజయం సాధించింది. 181 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్, 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 178 పరుగుల వద్ద నిలిచింది.

చివరి ఓవర్‌లో 9 పరుగులు అవసరమైన నేపథ్యంలో అవేశ్ ఖాన్ అద్భుతంగా బౌలింగ్ చేసి మ్యాచ్‌ను లఖ్‌నవూ ఖాతాలో వేసాడు.

రాజస్థాన్ తరఫున యశస్వి జైస్వాల్ (74: 50 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సులు) అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. రియాన్ పరాగ్ 39, టీనేజ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ 34 పరుగులతో మెరిశారు.

చివర్లో హెట్‌మయర్ (12) విజయం సాధించడంలో విఫలమయ్యాడు. లఖ్‌నవూ బౌలర్లలో అవేశ్ ఖాన్ 3 వికెట్లు తీసి విజయంలో కీలక పాత్ర పోషించాడు.

తొలుత బ్యాటింగ్ చేసిన లఖ్‌నవూ జట్టు 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 180 పరుగులు చేసింది. ఐదెన్ మార్‌క్రమ్ (66), ఆయుష్ బదోని (50) అర్ధశతకాలు బాదగా, అబ్దుల్ సమద్ (30*; 10 బంతుల్లో 4 సిక్స్‌లు) చివర్లో మెరుపులు మెరిపించాడు. రాజస్థాన్ బౌలర్లలో హసరంగ 2 వికెట్లు పడగొట్టాడు.

ఈ మ్యాచ్‌తో లఖ్‌నవూ పాయింట్స్ పట్టికలో మంచి లీడ్ తీసుకుంది. జైస్వాల్, మార్‌క్రమ్, అవేశ్ ఖాన్ ప్రదర్శనలు అభిమానులకు ఫుల్ ట్రీట్ ఇచ్చాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular