fbpx
Saturday, January 18, 2025
HomeMovie NewsRRR 'దోస్తీ' పాట విడుదల

RRR ‘దోస్తీ’ పాట విడుదల

RRR Dosti SongRelease

టాలీవుడ్: దేశం మొత్తం ఎదురు చూస్తున్న పాన్ ఇండియా సినిమాల్లో మొదటి ప్లేస్ లో ఉంటుంది ‘RRR ‘. బాహుబలి తర్వాత రాజమౌళి దర్శకత్వం వహించడం, రామ్ చరణ్ – తారక్ లాంటి పెద్ద నటులు నటించడం తో పాటు ఈ సినిమా నుండి ఇప్పటి వరకు విడుదలైన పోస్టర్స్, టీజర్స్ ఈ సినిమా పైన అంచనాలని ఆకాశానికి ఎత్తాయి. ఈ మధ్యనే షూటింగ్ ముగించుకున్న RRR టీం పోస్ట్ ప్రొడక్షన్ పనులతో పాటు ప్రమోషన్స్ కూడా మొదలు పెట్టింది. ఇందులో భాగంగా 2 నిమిషాల మేకింగ్ వీడియో రిలీజ్ చేసి ఆకట్టుకున్న ఈ సినిమా టీం ఇపుడు మొదటి పాటని విడుదల చేసింది.

ఈ రోజు ఫ్రెండ్షిప్ డే సందర్భంగా ఈ సినిమాలో చరణ్ -తారక్ దోస్తీ కి ప్రతీకగా ఈ పాటని రూపొందించారు. ఈ పాట కోసం ఐదు భాషల్లో ఈ పాటని పాడుతున్న సింగర్స్ తో ఒక ప్రొమోషన్ వీడియో కూడా విడుదల చేసారు. తెలుగు లో హేమ చంద్ర, హిందీ లో అమిత్ త్రివేది, తమిళ్ లో అనిరుద్ రవిచందర్, మళయాళం లో విజయ్ ఏసుదాస్, కన్నడ లో యాజిన్ నజీర్ ఈ పాటని ఆలపించారు. వీరందరితో సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి కలిసి ఒక ప్రొమోషన్ వీడియో కూడా విడుదల చేసారు. ఈ పాటలో హీరోలు తారక్ మరియు చరణ్ లు కూడా మెరిశారు.

మొదటి నుండి ఫైర్ మరియు వాటర్ బ్యాక్ డ్రాప్ లలో ఈ సినిమా ప్రొమోషన్ జరుగుతుంది. ఈ పాటలో కూడా ఫైర్ మరియు వాటర్ బ్యాక్ డ్రాప్ లో రూపొందించారు. తెలుగులో ఈ పాటని సిరివెన్నెల సీతారామ శాస్ట్రీ రచించారు. ఆయన రచన ఈ పాటకి అద్భుతం అని చెప్పవచ్చు. DVV ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై DVV దానయ్య ఈ సినిమాని నిర్మిస్తున్నారు. మరో కరోనా వేవ్ లేకపోతే ఎట్టి పరిస్థితుల్లో అనుకున్నట్టుగానే అక్టోబర్ 13 న ఈ సినిమాని ప్రపంచ వ్యాప్తంగా విడుదల చెయ్యడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular