హైదరాబాద్: ‘బాహుబలి’ సినిమా తర్వాత అత్యంత ప్రతిష్టాత్మకంగా రాజమౌళి దర్శకత్వం లో వస్తున్న సినిమా ‘RRR’. ఈ సినిమాకి సంబందించిన ఏ అప్డేట్ అయినా ఇట్టే వైరల్ అయిపోతుంది అంటే అర్ధం చేసుకోవచ్చు ఈ సినిమా కోసం ఎంత మంది ఎదురు చూస్తున్నారో. టాలీవుడ్ ఇద్దరు టాప్ మోస్ట్ హీరోలు ఎన్టీఆర్ , రామ్ చరణ్ హీరోలుగా నటిస్తున్న ఈ సినిమా అన్నీ కుదిరితే 2021 సంక్రాతి కి విడుదల కావాల్సింది. కానీ కరోనా కారణంగా దాదాపు 6 నెలలు షూటింగ్ కి బ్రేక్ పడింది. అయితే ఇవాళ్టి నుండి షూటింగ్ ప్రారంభించబోతున్నట్టు దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి ప్రకటించాడు.
రాజమౌళి ట్విట్టర్ లో ట్వీట్ చేస్తూ ‘మమ్మల్ని తిట్టడంలో మీ అసమానమైన సృజనాత్మకత పోస్టులు ఇక చాలు. మీ ప్రేమతో మమ్మల్ని ఉత్తేజ పర్చినందుకు ధన్యవాదాలు. సమయం గడిచింది. చివరకు ఆ క్షణం వచ్చేసింది. ఇప్పుడు మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడం మా వంతు. రేపటి కోసం వేచి ఉండండి’ అంటూ చెప్పాడు. ఇలా షూటింగ్ మొదలు పెట్టాడో లేదో అపుడే ఒక అప్డేట్ ఇవ్వబోతున్నట్టు ప్రకటించాడు. రాజమౌళి పుబ్లిసిటీ స్ట్రాటజీ గురించి తెలిసిన విషయమే. ఆ పుబ్లిసిటీ యే బాహుబలి ని అందనంత ఎత్తులో నిల్చోబెట్టింది. ఇపుడు కూడా సినిమాకి సంబందించిన ప్రతీ విషయాన్నీ ప్రకటిస్తూ జనాల నోట్లో నానేట్లు ప్లాన్ చేస్తున్నారు దర్శక ధీరుడు.పాన్ ఇండియా మూవీగా తెరకెక్కతున్న ఈ చిత్రాన్ని డీవీవీ దానయ్య భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు. బాలీవుడ్ స్టార్స్ అజయ్ దేవగన్, అలియా భట్ తో పాటు హాలీవుడ్ స్టార్స్ కూడా నటిస్తున్నారు.