టాలీవుడ్: ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న పాన్ ఇండియా చిత్రాల్లో మోస్ట్ అవైటెడ్ లిస్ట్ లో టాప్ లో ఉండే సినిమా ‘RRR ‘. బాహుబలి తర్వాత రాజమౌళి తీసే సినిమాలపై నేషనల్ లెవెల్ క్రేజ్ ఏర్పడింది. ఈ సంవత్సరంలోనే విడుదల అవ్వాల్సిన సినిమా కరోనా వల్ల షూటింగ్ కి బ్రేక్ పడడం తో చాలా నెలలు ఆగిపోవాల్సి వచ్చింది. అయితే కరోనా తర్వాత షూటింగ్ మొదలు పెట్టిన ఈ సినిమా టీం షర వేగంగా షూటింగ్ చేస్తున్నారు. వాతావరణ పరిస్థితులు కూడా లెక్క చేయకుండా రాత్రి పగలు కష్టపడుతున్నారు. ఈ మధ్య చలి తీవ్రత పెరగడం తో ఉష్ణోగ్రతలు బాగా తగ్గిపోయాయి. అందులోనూ RRR షూటింగ్ పీరియాడిక్ కాబట్టి షూటింగ్ జరిగే ప్రదేశాలు ఎక్కడో వూరు అవతల ఉంటాయి. అలాంటి ప్రదేశాల్లో చలి ఇంకా ఎక్కువగా ఉంటుంది.
ఈ మధ్య RRR సినిమా ప్రొడక్షన్ హౌస్ RRR డైరీస్ అని షూటింగ్ విశేషాలని షేర్ చేస్తూ ఎపుడూ ఎదో ఒక అప్డేట్ ఇస్తుంది. ఇపుడు అలాగే చలి లో RRR సినిమా షూటింగ్ కష్టాలు ఒక వీడియో ద్వారా షేర్ చేసింది. చలి లో టీం సభ్యులందరూ హీటర్లు దగ్గర, కుకింగ్ దగ్గర చలి కాచుకుంటూ షూటింగ్ చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో అయినా ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసి 2021 వేసవి కల్లా సినిమాని సిద్ధం చేయాలన్న దృఢ నిశ్చయం తో రాజమౌళి ఉన్నాడని అర్ధం అవుతుంది. DVV ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై DVV దానయ్య ఈ సినిమాని నిర్మిస్తున్నాడు. రాజమౌళి ఆస్థాన సంగీత దర్శకుడు ఎం ఎం కీరవాణి ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నాడు. పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో స్టార్స్ కూడా బాలీవుడ్, కోలీవుడ్ నుండి వచ్చి నటిస్తున్నారు. ఈ సినిమా 5 భాషల్లో రూపొందుతుంది.