టాలీవుడ్: తెలుగు నుండి వస్తున్న సినిమాల్లో మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా మూవీ గా రాబోతున్న సినిమా ‘RRR’. బాహుబలి తర్వాత రాజమౌళి నుండి రాబోతున్న సినిమా కాబట్టి అంచనాలు కూడా ఎక్కువ గానే ఉన్నాయి. ఈ సినిమా లో టాలీవుడ్ నుండి రామ్ చరణ్, ఎన్టీఆర్ లాంటి పెద్ద హీరోలు మాత్రమే కాకుండా బాలీవుడ్ నుండి అజయ్ దేవగన్, ఆలియా బట్ మాత్రమే కాకుండా తమిళ్ మరియు కన్నడ ఇండస్ట్రీ నుండి కూడా కొంత మంది నటులు నటిస్తున్నారు. ఈ సినిమాని రాజమౌళి కూడా అదే రేంజ్ లో షూటింగ్ చేస్తున్నాడు.
ఒక యాక్షన్ సీక్వెన్స్ కోసం చలి లో కూడా 50 రోజులు పూర్తిగా రాత్రిళ్ళు షూటింగ్ చేసి పూర్తి చేసారు. 50 రోజులంటే కొంత మంది డైరెక్టర్లు ఒక సినిమానే పూర్తి చేస్తారు. 50 రోజులు కేవలం ఒక భారీ యాక్షన్ సీక్వెన్స్ షూట్ చేసాడంటే రాజమౌళి ఈ సినిమాని ఏ లెవెల్ తో తీర్చిదిద్దుతున్నాడో అర్ధం చేసుకోవచ్చు. బాహుబలి కూడా యాక్షన్ సీక్వెన్స్ తోనే ఎక్కువ ఆకట్టుకుంది. భారతదేశం లో స్వాతంత్య్రం రాకముందు ఉన్న అల్లూరి సీతారామరాజు కథని మరియు కొమరం భీం కథని బేస్ చేసుకుని ఒక ఫిక్షన్ కథని రాసుకొని పాన్ ఇండియా రేంజ్ లో తీర్చిదిద్దుతున్నాడు.