fbpx
Sunday, January 19, 2025
HomeMovie NewsRRR విడుదల తేదీ ప్రకటించిన రాజమౌళి

RRR విడుదల తేదీ ప్రకటించిన రాజమౌళి

RRRMovie ReleaseDateAnnouncedBy Rajamouli

టాలీవుడ్: టాలీవుడ్ నుండి ఇప్పుడు వస్తున్న సినిమాల్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న RRR . బాహుబలి తర్వాత రాజమౌళి నుండి వస్తున్న సినిమా కావడం, టాలీవుడ్ టాప్ హీరోలు రామ్ చరణ్ మరియు జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో వస్తున్న మల్టీ స్టార్రర్ కావడం తో ఈ సినిమా పై అంచనాలు భారీ గా ఉన్నాయి. అంతే కాకుండా ఈ సినిమా నుండి ఇద్దరు హీరోలకి సంబందించిన టీజర్ లు ఎక్కడా అంచనాలకి తగ్గకపోవడం తో ఈ సినిమాకి విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. ఈ సినిమాని 2021 అక్టోబర్ 21 న విడుదల చేయనున్నట్టు ప్రకటించారు రాజమౌళి.

ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్ చరణ్, కొమురం భీం పాత్రలో జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్నారు. ఈ సినిమా విడుదల తేదీ తో పాటు ఒక పోస్టర్ కూడా విడుదల చేసారు. గుర్రం పై స్వారీ చేస్తున్న రామ్ చరణ్ మరియు బుల్లెట్ పై దూసుకువెళ్తున్న జూనియర్ ఎన్టీఆర్ ఈ పోస్టర్ లో ఆకట్టుకున్నారు. ఈ సినిమాలో అలియా భట్ మరియు కొన్ని ముఖ్య పాత్రల్లో అజయ్ దేవగన్, సముద్ర ఖని, శ్రియ లాంటి సీనియర్ స్టార్స్ నటిస్తున్నారు. డివివి దానయ్య నిర్మాణంలో రూపొందిన ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తి చేసుకుంది. కరోనా వల్ల ఇంకా ఆలస్యం ఐతుందనుకున్న ఈ సినిమాని రాజమౌళి త్వరగానే పూర్తి చేసి విడుదలకి సిద్ధం చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular