టాలీవుడ్: తెలుగు సినిమా ఇండస్ట్రీ నుండి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సినిమా, దాదాపు ఇండియా మొత్తం ఎదురుచూస్తున్న సినిమాల్లో ముందు వరుసలో ఉండే సినిమా ఏదీ అంటే ‘RRR ‘ . కరోనా ఫస్ట్ వేవ్ లాక్ డౌన్ తర్వాత శర వేగంగా షూటింగ్ పూర్తి చేసి సినిమాని సిద్ధం చేసి అక్టోబర్ లో సినిమా విడుదల చేయడానికి సిద్ధం చేస్తున్నాడు ఎస్.ఎస్.రాజమౌళి. సినిమా షూటింగ్ మొత్తం పూర్తి అయినట్టు ఇవాళ ప్రకటించారు. కొన్ని చిన్న చిన్న షాట్స్ తప్ప సినిమా మొత్తం షూటింగ్ పూర్తి అయిందని మరి కొద్దీ రోజుల్లో అప్ డేట్స్ మరియు ప్రమోషన్స్ మొదలు పెట్టనున్నట్టు ప్రకటించారు మేకర్స్.
ఈ మధ్యనే ఉక్రెయిన్ లో కొంత పార్ట్ షూట్ చేసిన RRR టీం, హైదరాబాద్ కి వచ్చి మిగతా పెండింగ్ పార్ట్ ని పూర్తి చేసారు. రామ్ చరణ్, జూనియర్ ఎన్ఠీఆర్ ఈ సినిమాని పూర్తి చేసి తమ తర్వాతి సినిమాలు మొదలుపెట్టనున్నారు. రామ్ చరణ్ తమిళ డైరెక్టర్ శంకర్ తో, జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో తదుపరి సినిమాలు చేయనున్నారు. RRR సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి చేసుకుని కోవిడ్ లాంటి అవాంతరాలు లేకుంటే ఎట్టి పరిస్థితుల్లో అనుకున్నట్టుగా అక్టోబర్ 13 న విడుదల చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నాడు రాజమౌళి.