ఉత్తరప్రదేశ్: పెళ్లి బరాత్‌లో రూ.20 లక్షల నోట్ల వర్షం
ఈ ఏడాది నవంబరు, డిసెంబరు నెలల్లో 48 లక్షల వివాహాలు జరగనున్నాయని అంచనా.
ఈ నేపథ్యంలో వివాహ వేడుకల్లో కొన్ని ఆసక్తికర సంఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ పెళ్లి బరాత్ ఘటన వాటిలో ఒకటిగా నిలిచింది.
ఉత్తరప్రదేశ్‌లోని సిద్ధార్థనగర్‌లో ఒక పెళ్లి ఊరేగింపులో నోట్ల వర్షం కురిసిన ఘటన ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశమైంది.
దేవల్వా గ్రామంలో జరిగిన ఈ పెళ్లి బరాత్ సందర్భంగా వరుడి కుటుంబీకులు జేసీబీలు, ఇళ్ల పైకప్పులపైకి ఎక్కి రూ.100, రూ.200, రూ.500 నోట్ల కట్టలను గాలిలోకి విసరారు.
ఈ వేడుకలో దాదాపు రూ.20 లక్షల నోట్లను గాలిలోకి వెదజల్లారు.
ఈ ఘటన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో నెటిజన్లు పెద్ద ఎత్తున విమర్శలు గుప్పించారు.
నెటిజన్ల స్పందనలు
- “ఇంత డబ్బుతో పేద అమ్మాయిలకు పెళ్లిళ్లు చేయవచ్చు!”
- “ఇన్‌కమ్ ట్యాక్స్‌కు కాల్ చేయండి, వీరి ఖాతాలను తనిఖీ చేయాలి.”
- “వీరు డబ్బును ఇలా వెదజల్లడం కంటే ఉపయోగకరమైన పనులకు వినియోగిస్తే బాగుండేది.”
వీడియోపై పోలీసుల చర్యలు
వీడియో వైరల్ కావడంతో సిద్ధార్థనగర్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ విచారణ ప్రారంభించారు.
ఇంత పెద్ద మొత్తంలో డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందన్నది తెలుసుకోవాలని, అవసరమైన చర్యలు తీసుకోవాలని పోలీసు ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు.
ఈ ఘటనపై పూర్తి వివరాలు వెలుబడేందుకు పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు.