హైదరాబాద్: తెలంగాణలో ఇటీవలే తన ఐపీఎస్ పదవికి రాజీనామా చేసిన ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. మాజీ ఐపీఎస్ అధికారి అయిన ప్రవీణ్ కుమార్ ఇప్పుడు బీఎస్పీ రాష్ట్ర కో–ఆర్డినేటర్, ఈ విషయాన్ని ఆయన ట్విటర్ వేదికగా వెల్లడించారు. ‘‘గడచిన రెండు రోజుల నుండి నీరసంగా ఉండడంతో కరోనా పరీక్షలు చేయించుకున్నాను. దాని వల్ల పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది.
కాగా ఫలితం తెలిసిన వెంటనే గాంధీ హాస్పిటల్ కు వెళ్లి చికిత్స చేయించుకున్నా తరువాత ఇప్పుడే డిశ్చార్జ్ అయ్యాను. నాతో ఇటీవల కాలంలో అత్యంత దగ్గరగా ఉన్న వ్యక్తులను ఐసోలేషన్‌లో ఉండాలని కోరుకుంటున్నాను. కాగా నాకు చాలా స్వల్పమైన లక్షణాలే ఉన్నాయి. దీని గురించి పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు’’ అంటూ ప్రవీణ్ కుమార్ ట్వీట్ చేశారు.
గత ఆదివారం రోజున నల్లగొండ ఎన్జీ కాలేజీ మైదానంలో జరిగిన ఒక భారీ సభలో ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ హాజరైన సంగతి తెలిసిందే. రాజ్యాధికార సంకల్ప సభలో బీఎస్పీ నేషనల్ కోఆర్డినేటర్ రామ్‌జీ గౌతమ్ సమక్షంలో ప్రవీణ్‌కుమార్ బహుజన సమాజ్ పార్టీ(బీఎస్పీ)లో చేరిన సంగతి తెలిసిందే. ఈ సభకు భారీ ఎత్తున జనాలు తరలివచ్చారు.