మూవీడెస్క్: కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్ (Rukmini Vasanth) ‘సప్తసాగరాలు దాటి’ సిరీస్‌తో ప్రేక్షకుల హృదయాలను దోచుకుంది.
ఇప్పుడు తెలుగులో ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’ సినిమాతో అడుగుపెడుతోంది.
నిఖిల్‌కు జోడీగా నటిస్తున్న రుక్మిణి, తమిళంలో శివ కార్తికేయన్‌తో కూడా ఒక సినిమా చేస్తోంది.
మరో వైపు, కన్నడలో శివరాజ్ కుమార్ సరసన ‘భారతి రంగల్’లో కూడా కనిపించనుంది.
ఇప్పటికే పలు సినిమాలతో బిజీగా ఉన్న రుక్మిణి, తాజాగా ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో రాబోతున్న భారీ బడ్జెట్ చిత్రం ‘డ్రాగన్’లో హీరోయిన్‌గా ఎంపికయిందనే రూమర్లు చక్కర్లు కొడుతున్నాయి.
ప్రశాంత్ నీల్ కథ అందించిన ‘బఘీరా’ మూవీలో శ్రీమురళీతో జత కట్టింది రుక్మిణి.
ఈ వార్తలపై స్పందిస్తూ, “ఇప్పటివరకు ఎలాంటి ఆఫర్ రాలేదు, కానీ ఛాన్స్ వస్తే సంతోషంగా సైన్ చేస్తాను,” అంటూ క్లారిటీ ఇచ్చింది.
‘డ్రాగన్’ చిత్రానికి మాఫియా బ్యాక్‌డ్రాప్ ఉన్న భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ కాబట్టి, స్టార్ హీరోయిన్ కోసం పరిశీలనలు జరుగుతున్నాయని టాక్ వినిపిస్తోంది.
ప్రస్తుతం ఎన్టీఆర్ ‘వార్ 2’ షూటింగ్‌లో ఉన్నారు, దీని తర్వాత ‘డ్రాగన్’ షూటింగ్‌పై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.