లండన్: కరోనా నుంచి మానవాళిని కాపాడేందుకు ప్రపంచంలోని అన్ని దేశాలు తమ వంతు ప్రయత్నం చేస్తున్న వేళ ఒకింత ముందు రష్యా ఉన్న సంగతి తెలిసిందే. ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ టీకా కూడా కీలకమైన మూడో దశ క్లినికల్ ట్రయల్స్‌కు చేరుకోగా, అమెరికన్ కంపెనీ మోడెర్నా అభివృద్ధి చేస్తున్న వ్యాక్సిన్ మూడో దశ మానవ ప్రయోగాలు ఈ నెల 27న మొదలు కానున్నాయి.
అయితే పరీక్షల విషయంలో కొంత గందరగోలంలొ ఉన్నప్పటికీ రష్యాలోని సెషనోవ్ యూనివర్సిటీ (రష్యా) టీకా ఆగస్టు రెండోవారానికల్లా అందుబాటులోకి రానుందనే వార్తలు వినిపిస్తున్నాయి. అదే జరిగితే ప్రపంచలోనే తొలి కరోనా నిరోధక టీకా అందుబాటులోకి తెచ్చిన ఘనత రష్యా సొంతమవుతుంది.(భారత్ ఫార్మా రంగాన్ని కొనియాడిన బిల్ గేట్స్)
ఈ పరిస్థితుల్లో ఊహించని వార్త ఒకటి సంచలనం రేపుతోంది. అమెరికా, కెనడా, బిటన్ దేశాలు రష్యా తమకు సంబంధించిన కరోనా వ్యాక్సిన్ డేటాను తస్కరించే ప్రయత్నంలో ఉందని ఆరోపణలు చేశాయి. రష్యాకు సంబంధించిన ఇంటలిజెన్స్ సంస్థలు తమ దేశాలకు సంబంధించిన ఫార్మా డేటాను హ్యాకింగ్ చేస్తున్నాయని ముక్తకంఠంగా చెబుతున్నాయి.
అయితే రష్యా అధ్యక్షుడి అధికార ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ ఈ వార్తలను ఖండించారు. తమ దేశం ఎప్పుడూ ఇలాంటి పనులకు పాల్పడదని పేర్కొన్నారు. గతంలో కూడా రష్యాపై ఇలాంటి ఆరోపణలు వచ్చాయి.