బెలారస్: రష్యా ఉక్రెయిన్‌పై యుద్ధం ప్రారంభించి ఈ రోజుకు ఎనిమిది రోజులు అయింది. ఈ యుద్ధంతో ఇప్పటికే ఉక్రెయిన్ భారీగా నష్టపోయింది. అదే సమయంలో ఈ యుద్ధ ప్రభావం రష్యా పై కూడా ప్రతికూలంగానే పడుతోంది. ఈ రెండు దేశాలు సమస్య పరిష్కారం దిశగా వెళ్లాలని ప్రపంచ దేశాలు కోరుతున్నాయి.
అయినప్పటికీ ఎవరివాదన వారిదే అన్న చందాన ఉంది రష్యా మరియు ఉక్రెయిన్ ల తీరు. తాజా సమాచారం ప్రకారం, మరి కాసేపట్లో ఉక్రెయిన్, రష్యా మధ్య చర్చలు జరగనున్నట్లు తెలుస్తోంది. చర్చలు చర్చలే, దాడులు దాడులే అన్నట్లు ఉంది రష్యా తీరు.
మా డిమాండ్లను ఇంతకు ముందే చెప్పాము, అది ఒప్పుకుంటేనే యుద్ధం ఆగుతుందని రష్యా స్పష్టం చేసింది. అయితే దోనాస్క్ ల్యూనిస్క్‌లను వదిలేయాలని ఉక్రెయిన్ అంటోంది. ప్రస్తుతం ఈ రెండో విడత చర్చల కోసం ఉక్రెయిన్ ప్రతినిధులు బెలారస్‌కు బయలుదేరారు.
ఇది వరకే ఫిబ్రవరి 28వ తేదీన బెలారస్‌లో రష్యా ఉక్రెయిన్‌ల మధ్య సుమారు 4 గంటల చర్చలు జరిగినా ఇరు వర్గాల మధ్య నెలకొన్న ప్రతిష్టంభన మాత్రం అలానే ఉంది. ప్రస్తుతం ఈ రోజు జరగబోయే చర్చలైనా సఫలం అవ్వాలని ఇరదేశాల ప్రజలతో పాటు యావత్ ప్రపంచం ఎదురు చూస్తోంది.